Team India : ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ లో క‌ష్టం

భార‌త సెలెక్ట‌ర్లు నిద్ర పోతున్నారా

Team India :  ఆస్ట్రేలియా వేదిక‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వ‌హించే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రిగేందుకు కేవ‌లం నెల రోజుల స‌మ‌యం ఉంది.

ఎలాగైనా క‌ప్ గెల‌వాల‌ని కృత నిశ్చ‌యంతో ఉంది టీమిండియా(Team India) . ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక చేసిన జ‌ట్టు ఆడుతున్న తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు నెల‌కొన్నాయి.

యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న మెగా టోర్నీ ఆసియా క‌ప్ -2022లో చేతులెత్తేసింది. చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ ప‌రిచింది. అటు లంకేయులు ఇటు పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది.

టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఆశించిన స్థాయిలో రాణించ లేక పోయారు. ఒక‌సారి బ్యాటింగ్ లో మెరిస్తే మ‌రోసారి బౌలింగ్ లో మెరిశారు. ఎక్క‌డా స‌మ‌తుల్య‌త క‌నిపించ లేదు జ‌ట్టులో.

ఆడే వాళ్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఎడా పెడా ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌డం వ‌ల్లనే ఇలా భార‌త్ ఆడుతోందంటూ తాజా మాజీలు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఇక మెగా టి20 ప్ర‌పంచ క‌ప్ కు స‌న్న‌ద్దం అయ్యేందుకు భార‌త జ‌ట్టు కేవ‌లం 6 మ్యాచ్ లు మాత్ర‌మే ఆడ‌నుంది. ఇదే జ‌ట్టును గ‌నుక కొన‌సాగిస్తే ఇండియాపై ఆశ‌లు వ‌దులు కోవాల్సిందే.

కేవ‌లం ఆరు జ‌ట్లు మాత్ర‌మే పాల్గొన్నాయి ఆసియా క‌ప్(Asiacup 2022) లో. ఇక్క‌డ విజ‌యం సాధించేందుకు నానా తంటాలు ప‌డిన భార‌త జ‌ట్టు రేప‌టి టోర్నీలో దిగ్గ‌జ జ‌ట్ల‌ను ఎలా త‌ట్టుకుని నిల‌బ‌డుతుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నానా తంటాలు ప‌డిన కోహ్లీ ఫామ్ లోకి రావ‌డం మాత్ర‌మే ప్ల‌స్ పాయింట్ జ‌ట్టుకు. మిగ‌తా ఆటగాళ్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ల‌ను కాపాడుకునేందుకు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం, భువీ ప్ర‌భావం చూప‌క పోవ‌డం, దినేశ్ కార్తీక్ ను కాద‌ని పంత్ కు చాన్స్ ఇస్తే రాణించ‌క పోవ‌డం..మితి మీరిన ఆత్మ విశ్వాసంతో పాండ్యా ఉండ‌డం..ఇలా చెప్పుకుంటూ పోతే జ‌ట్టుకు సంబంధించి ఎన్నో లోపాలున్నాయి.

చివ‌ర‌కు భార‌త జ‌ట్టులో ఎవ‌రు ఉంటారో ఉండ‌రోన‌న్న అభ‌ద్ర‌త నెల‌కొంది. అదే జ‌ట్టును కొంప ముంచుతోంది. క‌నీసం శ్రీ‌లంక జ‌ట్టును చూసైనా భార‌త్ నేర్చుకుంటే బెట‌ర్.

Also Read : శ్రీ‌లంక భ‌ళా పాకిస్తాన్ విల‌విల‌

Leave A Reply

Your Email Id will not be published!