Airtel 5G : నెలలో ఎయిర్ టెల్ 5జీ సేవలు
ప్రకటించిన టెలికాం కంపెనీ
Airtel 5G : ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్(Airtel 5G) సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే 5జీ స్పెక్ట్రమ్ వేలం పాటలో భారతీ ఎయిర్ టెల్ తో పాటు రిలయన్స్ జియో, వొడా ఫోన్ ఐడియా, అదానీ టెలికాం నెట్ వర్క్ పాల్గొన్నాయి.
5జీ సర్వీస్ అందించేందుకు అనుమతి పొందాయి. దీంతో దేశ వ్యాప్తంగా మరింత వేగంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలు పొందేందుకు వీలు కలుగుతుంది 5జీ సర్వీసెస్ వల్ల. కాగా ఎయిర్ టెల్ కంపెనీ అన్ని టెలికాం కంపెనీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఇప్పటికే దేశంలో పలు నగరాలలో 5జీ సర్వీసెస్ ఎలా ఉన్నాయనే దానిపై టెస్టింగ్ కూడా విజయవంతంగా చేపట్టింది. తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది సదరు కంపెనీ.
అదేమిటంటే 4జీ సిమ్ 5జీ ఫోన్ లలో పని చేస్తుందని తెలిపింది. ఎయిర్ టెల్(Airtel 5G) ఈ ఏడాది డిసెంబర్ నాటికి మెట్రో నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పేర్కొంది.
కాగా పాన్ ఇండియా లభ్యత మాత్రం 2023 చివరి నాటికి సాధ్యమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. 5జీ సర్వీసెస్ ప్రారంభమైతే 4జీ సిమ్ పని చేస్తుందా అన్న అనుమానం నెలకొంది.
శనివారం ఎయిర్ టెల్ కంపెనీ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. 4జీ సిమ్ 5జీ స్మార్ట్ ఫోన్ లలో పని చేస్తుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని పేర్కొంది.
అయితే 5జీ సేవలు పొందాలని అనుకుంటే సిమ్ మార్చాల్సిన పని లేదు. కానీ ఫోన్ ను తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు సిఇఓ గోపాల్ విట్టల్.
Also Read : ఇంటర్నెట్ సస్పెన్షన్ పై కోర్టు కామెంట్స్