KCR Party Comment : ‘సారు’ పార్టీపై సర్వత్రా ఆసక్తి
దేశంలో చక్రం తిప్పనున్నారా
KCR Party Comment : దేశ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్). ఇప్పటికే పలు రాష్ట్రాలలో పర్యటించారు.
భావ సారూప్యత కలిగిన నాయకులు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమాలోచనలు జరుపుతున్నారు. తన రాజకీయ ఎజెండా ఒక్కటే అది ప్రజల ఎజెండాగా ఉంటుందని స్పష్టం చేశారు.
గత కొంత కాలం నుంచీ తన విజన్ ఏమిటో చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం సారు పెట్టే పార్టీపై దేశ వ్యాప్తంగా చర్చకు (KCR Party) దారి తీస్తోంది. పలు
భాషల్లో ప్రావీణ్యం ఉండటం. సుదీర్గమైన రాజకీయ అనుభవం కలిగి ఉండడం కూడా కేసీఆర్ కు ప్లస్ పాయింట్ గా మారనుంది.
ఇదే క్రమంలో దేశ వ్యాప్తంగా ఏయే సమస్యలు ఉన్నాయో ముందే గుర్తించారు. వాటిని హైలెట్ చేస్తూ ఇప్పటికే దేశంలో ఉన్న చిన్న పార్టీలను తమకు సపోర్ట్ చేసేలా ముందస్తు ప్లాన్ చేస్తున్నారు.
వారందరూ కలిసి వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఢిల్లీ కేంద్రంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని(PM Modi), భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడం విపక్షాలను కూడా విస్మయానికి గురి చేస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీఆర్(CM KCR Comment) ను నమ్మడానికి వీలు లేదంటోంది. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆరోపిస్తోంది.
ఇదిలా ఉండగా దేశం డెవలప్ కావాలంటే ఏం చేయాలనే దానిపై ముందుగానే రోడ్ మ్యాప్ సిద్దం చేశారు.
అందులో భాగంగానే రైతు నేతలతో సమావేశం అయ్యారు. ప్రధానంగా దేశ పురోభివృద్దిలో ఎక్కువ భాగం జీడీపీ ఈ రంగం నుంచే వస్తోంది. అందుకే
ఆయన రైతులను ప్రస్తావిస్తూ , వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పనిలో పనిగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని ప్రస్తావిస్తూ మోదీ ఎనిమిదేళ్ల పాలనలో చోటు చేసుకున్న వైఫల్యాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
అటు హిందీలో ఇటు ఇంగ్లీష్ లో దేశ వ్యాప్తంగా తన దైన వాణిని, బాణిని వినిపించడంలో ఇప్పటి వరకు సక్సెస్ అయ్యారు. తాజాగా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తో కలిశారు.
లాలూ ప్రసాద్ యాదవత్ తో భేటీ అయ్యారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ఇందుకు గాను కొత్తగా పార్టీ పెట్టడమా లేక ఉన్న టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చడమా అన్నది తేలనుంది.
ఇప్పటికే పార్టీలో ఎవరు ఉండాలనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీని వెనుక ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్
కీలకంగా వ్యవహరించడం కూడా కేసీఆర్ దూకుడుకు కారణమని ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా కేసీఆర్ మామూలోడు కాదు. అనుకున్న దానిని చేసి చూపించే సత్తా కలిగిన రాజకీయ నాయకుడు. కాగా సారు పెట్టే పార్టీ కోసం దేశ వ్యాప్తంగా
ఆసక్తి నెలకొంది. సక్సెస్ అవుతారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : నెలలో ఎయిర్ టెల్ 5జీ సేవలు