Chiranjeevi : పెద్ద‌న్న‌లా ప్రోత్స‌హించారు – చిరంజీవి

కృష్ణం రాజు మృతి తీర‌ని లోటు

Chiranjeevi : కృష్ణం రాజు మృతిపై స్పందించారు ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి. ఆయ‌న ఇంత త్వ‌ర‌గా త‌మ‌ను వీడి వెళ్లి పోతార‌ని అనుకోలేద‌న్నారు.

ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ లోని గ‌చ్చి బౌలి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉద‌యం 3.25 గంట‌ల‌కు క‌న్ను మూశారు కృష్ణం రాజు. రెబ‌ల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ప్ర‌తి నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 183 సినిమాల్లో న‌టించారు. ఆయ‌న ఆఖ‌రి సినిమా త‌న సోద‌రుడి త‌న‌యుడు ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకున్నారు చిరంజీవి(Chiranjeevi).

సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో త‌న‌ను ప్రోత్స‌హించార‌ని కొనియాడారు. ఆయ‌న లేని టోటు సినీ ప‌రిశ్ర‌మ‌కు , ప్ర‌ధానంగా త‌న‌కు తీర‌ని లోటుగా పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆవేద‌న‌ను పంచుకున్నారు.

సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న మా ఊరి హీరో. నాటి మ‌న‌వూరి పాండ‌వులు నుంచి నేటి వ‌ర‌కు మా మ‌ధ్య బంధం అత్యంత ఆత్మీయ‌మైద‌ని తెలిపారు చిరంజీవి. నటుడిగా, కేంద్ర మంత్రిగా విశిష్ట సేవ‌లు అందించారు.

ల‌క్ష‌లాది మంది అభిమానుల‌కు విషాద‌క‌ర‌మైనద‌ని అన్నారు చిరంజీవి. కుటుంబీకుల‌కు, త‌మ్ముడు ప్ర‌భాస్ కు నా సంతాపం తెలియ చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా కృష్ణం రాజు ఏపీలోని మొగ‌ల్తూరులో పుట్టారు. విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా గుర్తింపు పొందారు. కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్. ఈ మేర‌కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని సీఎస్ ను ఆదేశించారు.

Also Read : అధికార లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

Leave A Reply

Your Email Id will not be published!