Sri Lanka Win Asia Cup : లంకేయులదే ఆసియా కప్
తలవంచిన పాకిస్తాన్
Sri Lanka Win Asia Cup : యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ -2022 లంకేయులకే(Sri Lanka Win Asia Cup) దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగింది. ప్రారంభ మ్యాచ్ లోనే ఆఫ్గనిస్తాన్ తో ఓటమి పాలైంది.
ఆ తర్వాత జూలు విదిల్చింది. దుమ్ము రేపింది. సత్తా చాటింది. అన్ని రంగాలలో రాణించి ఏకంగా టైటిల్ ఎగరేసుకు పోయింది. ఓ వైపు దేశం ఆర్థికంగా,
రాజకీయంగా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో శ్రీలంక అసాధారణమైన ఆట తీరును ప్రదర్శించింది.
దేశం యావత్తు గర్వించేలా తనను తాను ప్రూవ్ చేసుకుని విజేతగా నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ స్కిప్పర్ బాబర్ ఆజం టాస్ గెలిచి
ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
మొదట్లోనే వికెట్లను కోల్పోతూ వచ్చింది శ్రీలంక. ఒకానొక దశలో 100 పరుగులకే పరిమితవుతుందని అనుకున్నారంతా. కానీ 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 170 పరుగులు చేసింది.
భానుక రాజపక్స ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 45 బంతులు ఎదుర్కొని 71 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో 6 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. కుష్ మెండీస్, గుణ తిలక, షనక, నిసాంక, డిసిల్వ నిరాశ పరిచారు. ఒకానొక దశలో 58 పరుగులకే 5 వికెట్లు
కోల్పోయి ఇక్కట్ల పాలైన శ్రీలంకను ఒడ్డుకు చేర్చాడు రాజపక్స. హసరంగ భానుకకు తోడుగా నిలిచాడు.
36 పరుగులు చేసి రాణించాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. కరుణ రత్నే 14 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో భారీ స్కోర్ సాధించింది
శ్రీలంక(Sri Lanka Win Asia Cup). అనంతరం 171 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 147 పరుగులకే ఆలౌటైంది.
ఓపెనర్ రిజ్వాన్ 55 రన్స్ చేస్తే ఇఫ్తిఖార్ 32 , రవూఫ్ 13 రన్స్ చేశారు. ప్రమోద్ 4 నాలుగు వికెట్లు తీస్తే హసరంగా మూడు వికెట్లు పడగొట్టారు. భానుకకు
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా హసరంగకు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ దక్కింది.
Also Read : సమిష్టి కృషికి సంకేతం శ్రీలంక విజయం