Sri Lanka People Celebrate : శ్రీలంక విజయం పులకించిన జనం
దేశ వ్యాప్తంగా విజయోత్సవాలు
Sri Lanka People Celebrate : యూఏఈ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ -2022ను స్వంతం చేసుకుంది శ్రీలంక జట్టు. అసాధారణమైన ఆట తీరుతో బలమైన పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించింది.
సమిష్టి ప్రదర్శనతో తనకు ఎదురు లేదని చాటింది. శ్రీలంక ఆసియా కప్ గెలవగానే తీవ్రమైన ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంక దేశంలో ప్రజలంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు.
తాము సాధించిన విజయంగా భావించారు. సంబురాలు చేసుకున్నారు(Sri Lanka People Celebrate). జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇంకా విజయోత్సవాలను చేసుకుంటున్నారు.
ఒక రకంగా ఆ దేశానికి, ప్రజలకు ఈ విజయం ఓ టానిక్ లాంటిదని చెప్పవచ్చు. పిల్లలు, పెద్దలు, వృద్దులు సైతం ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. శ్రీలంక రాజధాని కొలంబో మొత్తం ప్రజల నినాదాలతో నిండి పోయింది.
తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న ఆ ప్రజలకు ఇది ఔషధం లాగా పని చేసింది. ప్రస్తుతం జరిగిన ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించాల్సి ఉంది.
కానీ టోర్నీని నిర్వహించే ఆర్థిక స్థోమత లేక పోవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు తాము నిర్వహించ లేమంటూ స్పష్టం చేసింది.
దీంతో ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని ఎంపిక చేసింది. శ్రీలంక ఆటగాళ్లు తమ దేశం కోసం ఆడారు. ఒక రకంగా ఆ దేశానికి గర్వ కారణంగా నిలిచారు.
నిజమైన ఛాంపియన్లుగా నిలిచారు. ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు శ్రీలంకలో చాలా చోట్ల వీధుల్లో భారీ టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
Also Read : సమిష్టి కృషికి సంకేతం శ్రీలంక విజయం