Sri Lanka Salute : ఆట‌కు గులాం దేశానికి స‌లాం

ఈ విజ‌యం దేశానికి అంకితం

Sri Lanka Salute : మెగా టోర్నీ ఆసియా క‌ప్ -2022 (Asia Cup – 2022) ముగిసింది. ఎవ‌రు గెలుస్తార‌ని సాగిన ఉత్కంఠ‌కు తెర ప‌డింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక ఎట్ట‌కేల‌కు అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దుమ్ము రేపింది.

ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్కలు చూపించి అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. బ‌ల‌మైన జ‌ట్ల‌ను కోలుకోలేని షాక్ కు గురి చేసింది. ఈ విజ‌యం ఆషా మాషీగా వ‌చ్చింది కాదు.

దాని వెనుక బ‌ల‌మైన ప‌ట్టుద‌ల ఉంది. అంత‌కంటే ఎక్కువ‌గా త‌మ దేశం ఆర్థికంగా, రాజ‌కీయంగా, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకానొక ద‌శ‌లో ఆ దేశ క్రికెట్ బోర్డు తాము టోర్నీని నిర్వ‌హించ లేమంటూ చేతులెత్తేసింది.

భ‌ద్ర‌తా కార‌ణాలు అని చెప్పినా ఆయా జ‌ట్ల‌కు సౌక‌ర్యాలు స‌మ‌కూర్చే స్థితిలో లేక పోవడం ప్ర‌ధాన స‌మ‌స్య‌. కానీ వీట‌న్నింటిని శ్రీ‌లంక జ‌ట్టు ఆట‌గాళ్లు అర్థం చేసుకున్నారు.

మిగ‌తా జ‌ట్లు ఆట‌ను , టోర్నీని లైట్ తీసుకున్నాయి. కానీ శ్రీ‌లంక అలా తీసుకోలేదు. విజ‌య‌మో వీర స్వ‌ర్గమో అన్నంత‌లా ప్ర‌తి మ్యాచ్ ను సీరియ‌స్ గా తీసుకున్నారు.

ఎలాగైనా క‌ప్ ఎగ‌రేసుకు పోవాల‌ని డిసైడ్ అయ్యారు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేశారు. స‌మిష్టిగా ఆడారు. క‌ళ్లు చెదిరేలా ఆసియా క‌ప్ ను స్వంతం చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మైదానమంతా లంక ఆట‌గాళ్లు త‌మ దేశ‌పు జాతీయ జెండాను ప‌ట్టుకుని సెల్యూట్(Sri Lanka Salute) చేశారు. ఇది తాము సాధించిన విజ‌యం కాద‌ని శ్రీ‌లంక దేశ ప్ర‌జ‌లు సాధించిన గెలుపుగా అభివ‌ర్ణించాడు శ్రీ‌లంక జ‌ట్టు కెప్టెన్ దాసున్ ష‌న‌క‌.

తాము సాధించిన ఈ విజ‌యం త‌మ దేశానికి ఒక బూస్ట్ గా ఉప‌యోగ ప‌డుతుంద‌న్నాడు. అత‌డు చెప్పిన దాంట్లో వాస్త‌వం లేక పోలేదు.

Also Read : శ్రీ‌లంక విజ‌యం పుల‌కించిన జ‌నం

Leave A Reply

Your Email Id will not be published!