Anand Mahindra : సక్సెస్ సాధించాలంటే స్టార్లు అక్కర్లేదు
శ్రీలంక విజయంపై ఆనంద్ మహీంద్రా
Anand Mahindra : ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ -2022ను అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక జట్టు(Srilanka Asia Cup – 2022) అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది.
అంతే కాదు మొదటి లీగ్ మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ తో ఓటమి పాలైనా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సమిష్టిగా రాణించింది. ఆపై సూపర్ -4కి చేరింది. ఆసియా కప్ హాట్ ఫేవరేట్స్ గా ఉన్న భారత, పాకిస్తాన్ జట్లకు చుక్కలు చూపించింది.
అద్భుతమైన ఆట తీరుతో బెంబేలెత్తించింది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటి ఏకంగా టైటిల్ ను కైవసం చేసుకుంది. అసలైన ఛాంపియన్ గా నిలిచింది.
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలకమైకన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
విజయానికి దగ్గరి దారులంటూ ఉండవని పేర్కొన్నారు. సమిష్టిగా కష్టపడితే ఎంతటి సక్సెస్ అయినా అందు కోగలమని లంకేయులు నిరూపించారని కితాబు ఇచ్చారు ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).
ఫైనల్ లో పాకిస్తాన్ ను మట్టి కరిపించడం మామూలు విషయం కాదని ప్రశంసలతో ముంచెత్తారు ఈ వ్యాపారవేత్త. శ్రీలంక విజయంతో నేను ఉద్వేగానికి లోనయ్యాను. పాకిస్తాన్ ఓడి పోవాలని నేను కోరుకోవడం వల్ల కాదు. కానీ శ్రీలంకలో స్టార్లు లేరు.
పేరొందిన ఆటగాళ్లు అంతకన్నా లేరు. కానీ గెలవాలన్న పట్టుదల, కసి నాకు నచ్చిందని ప్రశంసించారు ఆనంద్ మహీంద్రా. నిజమైన టీమ్ స్పిరిట్ కు దక్కిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు.
Also Read : టి20 వరల్డ్ కప్ భారత జట్టు డిక్లేర్