Sanju Samson : సంజూకు అన్యాయం అభిమానుల ఆగ్ర‌హం

బీసీసీఐ సెలెక్ట‌ర్ల తీరుపై స‌ర్వ‌త్రా నిర‌స‌న

Sanju Samson :  ఆస్ట్రేలియాలో అద్భుత‌మైన ట్రాక్ రికార్డ్ క‌లిగిన ఆటగాళ్ల‌లో కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ఒక‌డు. ఈ విష‌యాన్ని భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కోచ్ ర‌విశాస్త్రి స్ప‌ష్టంగా పేర్కొన్నాడు.

ఈసారి ఆ దేశంలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో శాంస‌న్ ను త‌ప్ప‌క ఎంపిక చేయాల‌ని సూచించాడు. ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కోరాడు. ఇటీవ‌ల జ‌రిగిన సీరీస్ ల‌లో సైతం అద్భుతంగా రాణించాడు. రిష‌బ్ పంత్ , దినేష్ కార్తీక్ కంటే అద్భుతంగా కీపింగ్ చేశాడు.

కానీ బీసీసీఐ సెలెక్ట‌ర్లు మ‌రోసారి మొండి చేయి చూపించారు సంజూ శాంస‌న్ కు(Sanju Samson). ఆ ఇద్ద‌రి ఆట‌గాళ్ల కంటే స్ట్రైక్ రేట్ బాగున్నా ఎందుకని ఎంపిక చేయ‌లేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు, అభిమానులు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌నీసం స్టాండ్ బై ఆట‌గాళ్ల‌లో కూడా ఎంపిక చేయ‌డం పూర్తిగా వివ‌క్ష చూపడం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొన్నారు.

సంజూ శాంస‌న్ జింబాబ్వేతో పాటు వెస్టిండీస్ తో త‌న చివ‌రి టి20 సీరీస్ ఆడాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఐర్లాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేశాడు.

సెలెక్ట‌ర్లు ప‌ర్ ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేయ‌లేద‌ని అలా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే పంత్, కార్తీక్ కంటే ముందంజ‌లో శాంస‌న్ ఉన్నాడ‌ని తెలిపారు. కావాల‌ని సెలెక్ట‌ర్లు, కెప్టెన్, కోచ్ కేర‌ళ స్టార్ కు అన్యాయం త‌ల‌పెట్టారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

Also Read : సక్సెస్ సాధించాలంటే స్టార్లు అక్క‌ర్లేదు

Leave A Reply

Your Email Id will not be published!