Kunal Kamra : దేశంలో కళాకరులకు భద్రత లేదు – కమ్రా
కమెడియన్ కునాల్ తీవ్రమైన ఆవేదన
Kunal Kamra : ప్రముఖ హాస్య నటుడు, స్టేజ్ షో నిర్వాకుడిగా పేరొందిన కునాల్ కమ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా ఈ దేశంలో కళాకారులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు.
ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. హర్యానాలో సెప్టెంబర్ 17, 18 తేదీలలో తన షో నిర్వహించాల్సి ఉంది. అయితే హిందూత్వ సంస్థలు తమ దేవుళ్లను కించ పరిచారంటూ ఫిర్యాదు చేశారు.
దీంతో కునాల్ కమ్రా షోస్ రద్దయ్యాయి. దీనిపై కునాల్ కమ్రా(Kunal Kamra) సీరియస్ గా స్పందించారు. ఎవరు నిజమైన హిందువో చెప్పాలని డిమాండ్ చేశారు.
మహాత్మా గాంధీని చంపిన నాథు రామ్ గాడ్సే మా వాడు కాదంటూ హిందూత్వ సంస్థలు బహిరంగంగా ప్రకటించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు నోట్ విడుదల చేశారు.
ఇది సంచలనం కలిగించింది. ప్రస్తుతం కళాకారులు (ఆర్టిస్టులు) స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి కనిపించడం లేదు. బాలీవుడ్ నుంచి కమెడియన్ల వరకు అందరూ ఏదో ఒక భయంతో పని చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారు. ఆపై వారిని భయాందోళనలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు కునాల్ కమ్రా. కళాకారుడికి అన్నం లేక పోయినా ఉండగలుగుతాడు కానీ స్వేచ్ఛ లేక పోతే ఉండలేరని పేర్కొన్నాడు.
ప్రస్తుతం భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని రెచ్చగొడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించాడు కునాల్ కమ్రా(Kunal Kamra). ఇటీవల కళారూపాలే కాదు పలు సినిమాలను కూడా హిందూత్వ గ్రూపులు అభ్యంతరం వ్యక్తం చేశాయన్నాడు.
రణ బీర్ కపూర్ , ఆలియా భట్ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర ఒకటి అని తెలిపాడు.
Also Read : నేను మీ కంటే గొప్ప హిందువును – కమ్రా