Mohammad Azaharuddin : భార‌త సెలెక్ట‌ర్ల‌పై అజ్జూ ఆగ్ర‌హం

టి20 వ‌ర‌ల్డ్ జ‌ట్టు ఎంపిక‌పై ఫైర్

Mohammad Azaharuddin : త్వ‌ర‌లో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గ‌బోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును(Team India T20 Squad) డిక్లేర్ చేసింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది సోష‌ల్ మీడియాలో.

తాజా, మాజీ ఆట‌గాళ్లు తీవ్రంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ధానంగా పుల్ ఫామ్ లో ఉన్న సంజూ శాంస‌న్ ను కాద‌ని రిష‌బ్ పంత్ ను కొన‌సాగిస్తుండ‌డంపై నెటిజ‌న్లు మండిపడ్డారు.

తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సెలెక్ట‌ర్లు తీవ్ర ప‌క్ష‌పాతం చూపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో జ‌ట్టు ఎంపిక తీరు బాగోలేదంటూ పేర్కొన్నారు భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ , హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ చీఫ్ మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్(Mohammad Azaharuddin).

శ్రేయ‌స్ అయ్యర్, మ‌హ్మ‌ద్ ష‌మీని తుది జ‌ట్టులో చేర్చ‌క పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టాడు. ఆ ఇద్ద‌రిని విస్మ‌రించ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్య పోయేలా చ‌సింద‌ని పేర్కొన్నాడు అజ్జూ భాయ్.

ఈ ఏడాది అక్టోబ‌ర్ , న‌వంబ‌ర్ దాకా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఐసీసీ ఇప్ప‌టికే సెప్టెంబ‌ర్ 15 లోపు అన్ని జ‌ట్లు త‌మ తుది జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాల‌ని ఆదేశించింది.

ఆ మేర‌కు సోమ‌వారం బీసీసీఐ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఇక మోకాలి గాయం కార‌ణంగా ర‌వీంద్ర జ‌డేజా దూర‌మ‌య్యాడు. బుమ్రా, హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఆసియా క‌ప్ కు దూరంగా ఉన్నారు.

పూర్తి ఫిట్ కావ‌డంతో వారిని తుది జ‌ట్టులోకి ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. రవిచంద్ర‌న్ అశ్వ‌న్ , ర‌వి బిష్నోయ్ ని ప‌క్క‌న పెట్టారు. అవేశ్ ఖాన్ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌న స్థానాన్ని నిల‌బెట్టు కోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.

Also Read : నా క‌ల నిజ‌మైంది – కార్లోస్ అల్క‌రాజ్

Leave A Reply

Your Email Id will not be published!