Eatala Rajender : ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు
స్పీకర్ పోచారంపై అనుచిత వ్యాఖ్యలు
Eatala Rajender : మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంగా స్పీకర్ ను మరమనిషిగా పేర్కొన్న ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇందుకు ఈటల రాజేందర్ ఒప్పుకోలేదు. తాను అన్నదాంట్లో తప్పేమీ లేదన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
సమావేశాలు ముగిసే వరకు ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ విధించారు తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీ సబ్ రూల్ 2, రూల్ 340 కింద బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
స్పీకర్ కు సారీ చెప్పేందుకు ఈటల(Eatala Rajender) నిరాకరించారని, అందుకే ఆయనపై ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
కావాలని ఈటల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు గత కొంత కాలం నుంచీ చేస్తూ వస్తున్నారంటూ ఆరోపించారు మంత్రి. కావాలని కామెంట్స్ చేయడం ఆయనకు తగదన్నారు.
పలుమార్లు వ్యక్తులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారని, చివరకు స్పీకర్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారని మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి.
కావాలని కామెంట్స్ చేయడం, ఆపై సస్పెన్షన్ కు గురి కావడం ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిందించడం ఈటల రాజేందర్ కు అలవాటుగా మారిందన్నారు.
Also Read : ఎలక్ట్రిక్ షోరూంలో మంటలు 8 మంది మృతి