TSPSC JOBS : ఇంజ‌నీరింగ్ జాబ్స్ కు లైన్ క్లియ‌ర్

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్

TSPSC JOBS :  తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌రికొన్ని పోస్టుల భ‌ర్తీకి ప‌చ్చ జెండా ఊపింది. అదే ప‌నిగా నోటిఫికేష‌న్లు జారీ చేస్తూ వ‌స్తోంది. చివ‌ర‌కు ఒక్క పోస్ట్ కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేదు.

తాజాగా మ‌రో నోటిఫికేష‌న్ కు శ్రీ‌కారం చుట్టింది. ప్ర‌భుత్వం భ‌ర్తీకి లైన్ క్లియ‌ర్ ఇవ్వ‌డంతో ఇవాళ నోటిఫికేష‌న్ ఇచ్చింది. భ‌ర్తీకి సంబంధించి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) మ‌రో నోటిఫికేష‌న్(TSPSC JOBS) విడుద‌ల చేసింది.

ప‌లు విభాగాల్లో 833 ఇంజ‌నీరింగ్ ఉద్యోగాల భ‌ర్తీకి తాజాగా నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందుకు గాను అసిస్టెంట్ ఇంజ‌నీర్ , మున్సిప‌ల్ అసిస్టెంట్ ఇంజ‌నీర్ , టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ , జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ , త‌దిత‌రు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు టీఎస్పీఎస్సీ వెల్ల‌డించింది.

ఈ పోస్టుల భ‌ర్తీకి సంబంధించి సెప్టెంబ‌ర్ 29 నుంచి అక్టోబ‌ర్ 21 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది క‌మిష‌న్. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పోర్ట‌ల్ లో లాగిన్ కావాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసినా ఈరోజు వ‌ర‌కు భ‌ర్తీ కి సంబంధించి ఒక్క పోస్టుకు గాను నియామ‌కం కాలేదు.

ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల మున్సిప‌ల్ శాఖ‌లో 175 టౌన్ ప్లానింగ్ ఓవ‌ర్సీస్ పోస్టుల‌తో పాటు రాష్ట్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో 23 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఇదిలా ఉండ‌గా అన్ని పోస్టుల‌కు సంబంధించి స‌మ‌యం ఉన్నా ఎందుకని ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టించ‌డం లేద‌ని నిరుద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read : మ‌హిళా అభ్య‌ర్థుల‌కు మంచి ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!