Boy Apology : పంతులమ్మకు చిన్నారి క్షమాపణ వైరల్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Boy Apology : సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో చెప్పలేం. ఒక్కోసారి ఇలాంటి సన్నివేశాలు మనుషుల్ని కట్టి పడేస్తాయి. గురు, శిష్యుల బంధం అన్ని బంధాల కంటే గొప్పది.
ప్రధానంగా పెద్దాయ్యక పిల్లలు ఎలా చెబితే అలా వింటారు. కానీ చిన్న పిల్లలను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే టీచర్లకు కత్తి మీద సాము లాంటిదే. అలాంటిదే ఓ పిల్లాడు గత కొంత కాలంగా అల్లరికి బాగా ఆలవాటు పడ్డాడు.
ఎంత చెప్పినా వినిపించు కోలేదు. చివరకు ఆ పంతులమ్మకు కోపం వచ్చింది. ఏమైందో ఏమో కానీ తనతో టీచర్ మాట్లాడడం లేదని గ్రహించాడు ఆ చిన్నారి. ఇంకేం ఆమె వద్దకే వచ్చి సారీ చెప్పాడు.
ఇంకెప్పుడూ అలా చేయనంటూ చెప్పాడు. అంతే కాదు బతిమిలాడాడు. చివరకు టీచర్ కు ముద్దు పెట్టడంతో ఆమె కూడా ఆ పిల్లాడని (Boy Apology) క్షమించింది. ఇక నుంచి ఎప్పుడూ అల్లరి చేయొద్దంటూ కోరింది.
దీంతో పంతులమ్మ, అబ్బాయి మధ్య నడిచిన సంభాషణతో కూడిన వీడియో నెట్టింట్లోకి చేరింది. ఇంకేం ఇప్పుడు ఇంటర్నెట్ ను , సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఎంతో మందిని కదిలించింది. ఆ పిల్లాడు ఆమె బుగ్గలపై చాలా సార్లు ముద్దు పెట్టు కోవడం ఆమె మారాము చేయడం ఎంతో మందిని ఆలోచించేలా చేసింది.
మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆనందించే వయస్సు వాళ్లది. అల్లరి చేయడం సహజం. ఈ మధ్య పిల్లల్లో అల్లరి ఎక్కువై పోతోంది. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు తెగ వైరల్ అవుతూ షేర్ అవుతున్నాయి.
Also Read : కంట తడి పెట్టిస్తున్న జైకాల్ మహాకాల్
ऐसा स्कूल मेरे बचपन में क्यों नहीं था 😏😌 pic.twitter.com/uHkAhq0tNN
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 12, 2022