Sanju Samson Comment : ఆడ‌ట‌మే శాంస‌న్ చేసిన నేర‌మా

బీసీసీఐ సెలెక్ట‌ర్ల తీరు అనుమానాస్ప‌దం

Sanju Samson Comment : ఎవ‌రైనా ఎక్క‌డైనా టాలెంట్ ఉందేమోన‌ని వెతుకుతారు. వాళ్ల‌ను అక్కున చేర్చుకుంటారు. అంతే కాదు వారి కోసం ఎంత ఖ‌ర్చు చేసేందుకైనా వెనుకాడ‌రు.

ప్ర‌పంచంలో ఏ క్రీడా సంస్థ‌లో నైనా పాటించే ప్రాథ‌మిక సూత్రం ఒక్క‌టే. ప్ర‌తిభ ఉన్న ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌డం సెలెక్ట‌ర్ల (ఎంపిక చేసే క‌మిటీ స‌భ్యులు) బాధ్య‌త‌.

కానీ ఇందుకు పూర్తిగా భిన్నంగా జ‌రుగుతోంది భార‌త దేశంలో. అదీ క్రికెట్ ప‌రంగా. ఇత‌ర క్రీడా సంస్థ‌ల మాటేమిటో కానీ భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి ( బీసీసీఐ )(BCCI) సెలెక్ష‌న్ క‌మిటీ అనుస‌రిస్తున్న విధానాలు, ఎంపిక చేస్తున్న తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

తాజా, మాజీ ఆట‌గాళ్లు నెత్తీ నోరు బాదుకున్నా ప్ర‌యోగాలు చేసుకుంటూ పోయారు. ఒక్క ఏడాదిలో అంటే 2021 త‌ర్వాత ఏడుగురు కెప్టెన్ల‌ను మార్చింది బీసీసీఐ.

ఇది ప్ర‌పంచ క్రికెట్ లో ఓ విచిత్ర‌మైన స‌న్నివేశం. ఏ దేశ క్రికెట్ బోర్డు ఇలాంటి ప్ర‌యోగాల‌కు సాహించ లేదు. అడ‌పా ద‌డ‌పా విజ‌యాలు సాధిస్తున్నా అస‌లైన టైంలో భార‌త జ‌ట్టు చేతులెత్తేస్తోంది.

దుబాయ్ లో జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది. తాజాగా కేవ‌లం ఆరు జ‌ట్లు మాత్ర‌మే పాల్గొన్న ఆసియా క‌ప్ -2022 నుంచి అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో వైదొలిగింది.

ఎలాంటి స్టార్లు లేని అత్యంత సాధార‌ణ‌మైన ఆట‌గాళ్ల‌తో కూడిన శ్రీ‌లంక జ‌ట్టు అద్భుతం చేసింది. మ‌హా మ‌హుల్ని ముప్పు తిప్ప‌లు పెట్టింది. చివ‌ర‌కు ఆసియా క‌ప్ ఛాంపియ‌న్ గా నిలిచింది.

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన ఐదు క్రీడా సంస్థ‌ల‌లో ఒక‌టిగా పేరొందిన బీసీసీఐ ఎందుకు ఇలా చేస్తుంద‌నే దానిపై విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

రాజ‌కీయాలు లేవ‌ని అనుకుంటాం కానీ ఎక్క‌డ లేని పాలిటిక్స్ బీసీసీఐలో ఉన్నాయి. కాల ప‌రిమితి ముగిసినా ఇంకా పద‌వుల‌ను అట్టి

పెట్టుకుని ఉన్న వారి గురించి ప్ర‌శ్నించే ద‌మ్ము సాహ‌సం ఎవ‌రికీ లేకుండా పోయింది.

బార‌త దేశాన్ని త‌న క‌నుస‌న్న‌ల‌లో శాసిస్తూ వ‌స్తున్న సూప‌ర్ ప‌వ‌ర్ గా, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన అమిత్ షా క‌న్ను బీసీసీఐ పై ప‌డింది.

కానీ ఆయ‌న పాత్ర ఏమీ లేద‌ని అనుకోవ‌డానికి వీలు లేదు. ఆయ‌న త‌న‌యుడే ఇప్ప‌డు అన్నీ తానై న‌డిపిస్తున్నాడు. ఐసీసీ చైర్మ‌న్

రేసులో దాదా ఉంటే ఏసీసీకి చైర్మ‌న్ హోదాలో జై షా ఉన్నాడు.

జోడు ప‌ద‌వులు ఉండ కూడ‌ద‌ని బీసీసీఐ రూల్స్ చెబుతున్నాయి. ఇది ప‌క్క‌న పెడితే జ‌ట్టు ఎంపిక‌కు సంబంధించి తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఏ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేస్తున్నారనే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మన్ గా ఉన్న చేత‌న్ శ‌ర్మ‌. ఆస్ట్రేలియా వేదిక‌గా త్వ‌ర‌లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది.

బంతులు అనూహ్యంగా పైకి లేస్తాయి. వాటిని త‌ట్టుకుని ర‌న్స్ చేయ‌డం చాలా క‌ష్టం. ఇదే విష‌యాన్ని మాజీ హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు.

ఇలాంటి బంతుల్ని ఎదుర్కొనే స‌త్తా భార‌త జ‌ట్టులో ఒక్క‌డికే ఉంద‌ని, అది కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ మాత్ర‌మేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. క‌నీసం స్టాండ్ బై కోసం కూడా శాంస‌న్ ను ఎంపిక చేయ‌క పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

పోనీ సంజూ కంటే స్ట్రైక్ రేట్ లో కానీ లేదా కీపింగ్ లో కానీ ఏమైనా ట్రాక్ రికార్డ్ రిష‌బ్ పంత్ కు ఉందా అంటే అదీ లేదు. పంత్ , దినేష్ కార్తీక్ కంటే స్ట్రైక్

రేట్ లో ముందంజ‌లో ఉన్న సంజూ శాంస‌న్(Sanju Samson) ను ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌నేదే బిగ్ క్వ‌శ్చ‌న్.

గ‌త మూడేళ్లుగా కోహ్లీ ఫామ్ కోల్పోయి నానా తంటాలు ప‌డినా ఎంపిక చేస్తూ వ‌చ్చిన సెలెక్ట‌ర్లు సంజూ శాంస‌న్ విష‌యంలో ఎందుకు వివ‌క్ష ప్ర‌ద‌ర్శించార‌నేది దేశానికి చెప్పాలి.

ఎందుకంటే క్రికెట్ బీసీసీఐది కాదు .భార‌త దేశానిది. ముందు దేశం ఆ త‌ర్వాతే ఆట‌. ఇది గుర్తిస్తే మంచిది. గంగూలీ, జేషా ..చేత‌న్ శ‌ర్మ

అండ్ టీం ఇక‌నైనా పున‌రాలోచించు కోవాలి.

ప్ర‌తిభ ఆధారంగా జ‌ట్టును ఎంపిక చేస్తే బాగుంటుంది. ఎంపిక‌పై మ‌రిన్ని అనుమానాలు త‌లెత్త‌క మాన‌వు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

Also Read : సంజూకు అన్యాయం అభిమానుల ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!