Arvind Kejriwal : అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్

సోనియాను పీఎంను చేసేందుకు కుట్ర‌

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గుజ‌రాత్ లో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోందంటూ ఆరోపించారు. అంతే కాకుండా బీజేపీ సోనియా గాంధీని మోదీ త‌ర్వాత ప్ర‌ధాన మంత్రిని చేసేందుకు య‌త్నిస్తోందంటూ మండిప‌డ్డారు.

ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో వైఫ‌ల్యం చెందింద‌న్నారు. గుజ‌రాత్ లో సుదీర్ఘ కాలం పాటు కొలువు తీరిన బీజేపీ స‌ర్కార్ ఏం చేసిందో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)  డిమాండ్ చేశారు.

ఈసారి త‌మ‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌ని ఖ‌త‌మైంద‌ని, దానికి భ‌విష్య‌త్తు అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు సీఎం.

ఇదిలా ఉండ‌గా మేధా పాట్క‌ర్ ను సీఎం చేసేందుకు ఆప్ య‌త్నిస్తోందంటూ బీజేపీ ఆరోపించింది. దీనికి ప్ర‌త్యామ్నాయంగా మోదీకి బ‌దులు సోనియాను పీఎంను చేస్తోందంటూ ఎద్దేవా చేశారు అర‌వింద్ కేజ్రీవాల్.

గుజ‌రాత్ రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు. ఆప్ సామాన్యుల‌కు చెందిన పార్టీ అని ఎవ‌రైనా క‌ష్టప‌డి పైకి వ‌స్తార‌ని ఇందులో ఎలాంటి పైర‌వీలు అంటూ ఉండ‌వ‌న్నారు.

కేంద్రం కావాల‌ని ఆప్ తో గిల్లి క‌జ్జాలు పెట్టుకుంటోంద‌న్నారు. మోదీ , అమిత్ షా, జేపీ న‌డ్డా క‌లిసి ఎంత‌గా ప్ర‌య‌త్నం చేసినా ఢిల్లీలో జెండా ఎగుర వేయ‌లేక పోయారంటూ ఎద్దేవా చేశారు సీఎం.  చితంగా నీరు, విద్యుత్ ఇవ్వాల‌ని కోర‌డం త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.

Also Read : జ‌రిమానాపై ఢిల్లీ హైకోర్టుకు అమెజాన్

Leave A Reply

Your Email Id will not be published!