Amazon Delhi HC : జరిమానాపై ఢిల్లీ హైకోర్టుకు అమెజాన్
ఫ్రెషర్ కుక్కర్ల కేసులో రూ. లక్ష జరిమానా
Amazon Delhi HC : ప్రెజర్ కుక్కర్ల కేసులో రూ . 1 లక్ష జరిమానా విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ హైకోర్టును ఆశ్రయించింది.
గత ఆగస్టులో నాణ్యతా ప్రమాణాలు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్లను విక్రయించినందుకు అమెజాన్ పై సీసీఈఏ లక్ష జరిమానా విధించింది.
దాని ప్లాట్ ఫారమ్ ద్వారా విక్రయించ బడిన 2,265 ప్రెషర్ కుక్కర్ల వినియోగదారులకు తెలియ చేయాలని, ఉత్పత్తులను రీకాల్ చేసి, ధరలను తిరిగి చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
ఇదిలా ఉండగా జరిమానా విధించడంపై అమెజాన్ ఢిల్లీ హైకోర్టును(Amazon Delhi HC) ఆశ్రయించింది. అయితే లక్ష జరిమానా విధిస్తూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ లేదా సీసీపీఏ జారీ చేసిన ఉత్తర్వులు తమకు వర్తించవని పేర్కొంటూ, జరిమానాను సవాల్ చేస్తూ అమెజాన్ కోర్టుకు ఎక్కింది.
ఇందుకు సంబంధించిన దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ యశ్వంత్ వర్మ ముందుకు వచ్చింది. ఈ విషయంపై డిపార్ట్ మెంట్ నుండి సూచనలు తీసుకునేందుకు సమయం కావాలని సీసీపీఏ న్యాయవాది తెలిపారు.
న్యాయవాది సూచనలను పొందేందుకు వీలుగా హైకోర్టు ఈ అంశాన్ని తదుపరి విచారణకు సెప్టెంబర్ 19న జాబితా చేసింది.
దేశీయ ప్రెషర్ కుక్కర్లను విక్రయించేందుకు అనుమతించినందుకు అమెజాన్ పై చర్యలు తీసుకునే హక్కు వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఉందని స్పష్టం చేసింది.
తాము ముందే వినియోగదారులకు చెప్పే విక్రయించడం జరిగిందని, ఇందులో తమ బాధ్యత లేదని అమెజాన్ తరపు న్యాయవాది వాదించారు. ఇందుకు సంబంధించి వాదోపవాదాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి.
Also Read : టీ హబ్ తో గోవా సర్కార్ ఒప్పందం