David Warner : వన్డే కెప్టెన్సీపై వార్నర్ మొగ్గు
ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తో ఖాళీ
David Warner : వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ ప్లేయర్ గా పేరొందాడు డేవిడ్ వార్నర్(David Warner). గతంలో కెప్టెన్సీ కూడా చేశాడు. కొంత కాలం పాటు నిషేధానికి గురయ్యాడు.
గత ఏడాదిలో ఊహించని రీతిలో పుల్ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పరుగుల వరద పారిస్తున్నాడు. అటు జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉంటూనే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు.
తాజాగా ఆస్ట్రేలియా జట్టు వన్డే కెప్టెన్ గా ఉన్న ఆరోన్ ఫించ్(Aaron Finch) రిటర్మైంట్ ప్రకటించాడు. దీంతో కెప్టెన్ పదవి ఖాళీగా ఉంది. తను దానిని పొందేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాడు.
ఇక చాపెల్ – హాడ్లీ ట్రోఫలో కీవీస్ పై ఆసిస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు ఆరోన్ ఫించ్. దీంతో అతడి స్థానంలో ఎవరు కెప్టెన్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా ఈ ఫార్మాట్ లో జట్టును నడిపించాలన్న కోరికను బహిరంగంగానే ప్రకటించాడు స్టార్ హిట్టర్ డేవిడ్ వార్నర్. కాగా 2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన సీరీస్ లో బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై వార్నర్(David Warner) తో పాటు స్టీవ్ స్మిత్ పై కూడా వేటు పడింది.
ప్రస్తుతం వార్నర్ కెప్టెన్సీ విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చలు జరపునున్నట్లు సమాచారం. మరో వైపు వచ్చే ఏడాది 2023లో 50 ఓవర్ల (వన్డే ) పరిమిత వరల్డ్ కప్ జరగనుంది.
ఇప్పటి నుంచే సమర్థవంతమైన నాయకుడి కోసం వెతుకుతోంది ఆసిన్ బోర్డు.
Also Read : ఆడటమే శాంసన్ చేసిన నేరమా