PM Modi Putin : ఇక‌నైనా యుద్దాన్ని ఆపండి – మోదీ

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో ప్ర‌ధాని

PM Modi Putin : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి ఇక‌నైనా ఆపాల‌ని కోరారు. మా ఆందోళ‌న‌ను స‌హృద‌యంతో అర్థం చేసుకోవాల‌ని కోరారు మోదీ ర‌ష్యా చీఫ్ పుతిన్ తో(PM Modi Putin).

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల‌ను ఖండించ లేదు. గ‌త కొంత కాలం నుంచి చ‌ర్చ‌ల ద్వారానే సంక్షోభానికి తెర ప‌డుతుంద‌న్నారు.

ఇవాల్టితో ఉక్రెయిన్ తో యుద్దం ప్రారంభ‌మై తొమ్మిదో నెల‌కు చేరుకుంది. ప్రాంతీయ శిఖరాగ్ర స‌ద‌స్సు (ఎస్సిఓ) లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా ర‌ష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ తో స‌మ‌ర్ ఖండ్ లో మోదీ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌ధానంగా ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్దం గురించి ప్ర‌స్తావించారు.

ప్ర‌స్తుతం యుద్ధానికి స‌మ‌యం కాద‌న్నారు మోదీ. త‌న మిత్ర దేశంగా ఉన్న చైనా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. దీనికి పుతిన్ కూడా కొంత ఇబ్బంది ప‌డ్డారు.

ఇదిలా ఉండగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) వ్య‌క్తం చేసిన ఆందోళ‌న‌ను తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని స్పష్టం చేశారు ఈ సంద‌ర్భంగా ర‌ష్యా చీఫ్ పుతిన్.

వీలైనంత త‌ర్వ‌గా దీనిని ముగించేందుకు మా వంతు కృషి చేస్తామ‌న్నారు. యుద్ద భూమిలో ఎదురు దెబ్బలు ఎదుర్కొంటుండ‌డం కూడా ప్ర‌ధానంగా మారింది.

ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ ఇప్ప‌టికీ త‌న పంతాన్ని వీడ‌డం లేద‌ని తాము యుద్దాన్ని త్వ‌రిత‌గ‌తిగ‌న ముగించాల‌ని చూస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు వ్లాదిమిర్ పుతిన్.

Also Read : 2023లో ప్ర‌పంచానికి మాంద్యం దెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!