World Face Recession : 2023లో ప్ర‌పంచానికి మాంద్యం దెబ్బ

ప్ర‌పంచ బ్యాంక్ నివేదికలో సంచ‌ల‌న నిజాలు

World Face Recession : ప్రపంచ బ్యాంకు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు విడుద‌ల చేసిన నివేదిక‌లో సంచ‌ల‌న అంశాలు వెల్ల‌డించింది. వ‌చ్చే ఏడాది 2023లో యావ‌త్ ప్ర‌పంచం ఆర్థిక మాంద్యాన్ని(World Face Recession) ఎదుర్కోనుంద‌ని హెచ్చ‌రించింది.

1970 నుండి మాంద్యం త‌ర్వాత కోలుకున్న త‌ర్వాత ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌స్తుతం అత్యంత మంద‌గ‌మ‌నంలో ఉంద‌ని ప్ర‌పంచ బ్యాంకు పేర్కొంది. ప్ర‌పంచ వృద్ది రేటు గ‌ణ‌నీయంగా మందగిస్తున్న‌ద‌ని ప్ర‌పంచ బ్యాంకు చీఫ్ డేవిడ్ మాల్ఫాస్ తెలిపారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఏక కాలంలో ద్ర‌వ్య విధానాన్ని క‌ఠిన‌త‌రం చేయ‌డంతో వ‌చ్చే ఏడాది ప్ర‌పంచం మాంద్యం ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌గ్గించేందుకు ఉత్ప‌త్తిని పెంచాల‌ని, స‌ర‌ఫ‌రా అడ్డంకుల‌ను తొల‌గించాల‌ని ప్ర‌పంచ బ్యాంకు తాజా నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచ మాంద్యం(World Face Recession) అనేక సూచిక‌లు ఇప్ప‌టికే కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

1970 నుండి మాంద్యం అనంతర కోలుకున్న త‌ర్వాత ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇప్పుడు అత్యంత మంద‌గ‌మ‌నంలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

కేంద్ర బ్యాంకుల గ్లోబ‌ల్ వ‌డ్డీ రేటు పెంపుద‌ల 4 శాతానికి చేరుకోవ‌చ్చ‌ని, 2021 రెండింత‌లు ఉన్నాయ‌ని తెలిపింది. ప్ర‌ధాన ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ఉంచేందుకు ఆహారం, ఇంధ‌నం వంటి అస్థిర వ‌స్తువుల‌ను 5 స్థాయిల‌లో తొల‌గిస్తుంద‌ని బ్యాంక్ తెలిపింది.

ఇక యుఎస్ నుండి యూర‌ప్, భార‌త దేశం వ‌ర‌కు దేశాలు రుణ రేట్ల‌ను దూకుడుగా పెంచుతున్నాయి.

ప్ర‌పంచ వృద్ది బాగా మందగిస్తోంది. మ‌రిన్ని దేశాలు మాంద్యంలోకి ప‌డి పోవ‌డంతో మ‌రింత మంద‌గించే అవ‌కాశం ఉందన్నారు ప్ర‌పంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మాల్పాస్.

Also Read : ప్ర‌పంచంలో అదానీ రెండో కుబేరుడు

Leave A Reply

Your Email Id will not be published!