Liquor Scam Comment : దాడులు స‌రే అస‌లు దొంగ‌లు ఎవ‌రు

ఈడీ దాడుల వ‌ర‌కేనా అరెస్ట్ చేస్తుందా

Liquor Scam Comment : దేశ వ్యాప్తంగా లిక్క‌ర్ స్కాం(Liquor Scam) ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఢిల్లీలో కొలువుతీరిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వం ఎక్సైజ్ పాల‌సీని తీసుకు వ‌చ్చింది.

ఇందుకు సంబంధించి కొత్తగా కొలువు తీరిన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఇందులో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయంటూ అభ్యంత‌రం లేవ‌దీశారు. ఆపై సీబీఐని విచార‌ణ‌కు ఆదేశించారు.

రంగంలోకి దిగిన ద‌ర్యాప్తు సంస్థ డిప్యూటీ సీఎం మ‌నీష సిసోడియా ఇంట్లో 14 గంట‌ల‌కు పైగా సోదాలు చేప‌ట్టింది. ఆయ‌న‌ను నెంబ‌ర్ వ‌న్ గా మిగ‌తా 14

మంది ఉన్న‌తాధికారుల‌ను చేర్చింది ఎఫ్ఐఆర్ లో.

దీనిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం చోటు చేసుకుంది. ఈ స్కాంలో ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, పంజాబ్ రాష్ట్రాల‌కు సంబంధించి లింకులు ఉన్నాయంటూ ఈడీ ఆరోపించింది.

ఈ మేర‌కు ఇప్ప‌టికే ప‌లు చోట్ల దాడులు చేప‌ట్టింది. తాజాగా దేశంలోని 40 చోట్ల ఏక కాలంలో భారీ భ‌ద్ర‌త న‌డుమ మ‌ధ్య దాడులు చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ సీఎం కూతురు ఎమ్మెల్సీ క‌విత ప్ర‌మేయం ఉంద‌ని, కల్వ‌కుంట్ల కుటుంబానికి చెందిన ప‌లువురు దీనిలో భాగం

పంచుకున్నారంటూ బీజేపీకి చెందిన ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదే స‌మ‌యంలో త‌న‌కు ఎలాంటి ఢిల్లీ లిక్క‌ర్ స్కాంతో సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది ఎమ్మెల్సీ క‌విత‌. కానీ ఇవాళ ఆమెకు సంబంధించి వ్య‌క్తిగ‌త ఆడిట‌ర్ గోరంట్ల బుచ్చిబాబు రెండు ఆఫీసుల‌పై సోదాలు చేప‌ట్టింది.

ఇంకో వైపు ఏపీలో ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డికి చెందిన ఆఫీసుల‌లో దాడులు నిర్వహించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సీబీఐ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.

విచిత్రం ఏమిటంటే ఒక్క హైద‌రాబాద్ లోనే 25 టీంల‌తో సోదాలు చేప‌ట్ట‌డం విశేషం. గ‌చ్చి బౌలి, నాన‌క్ రామ్ గూడ‌, కోకా పేట‌, దోమ‌ల‌గూడ‌, ఇందిరా పార్క్ , త‌దిత‌ర ప్రాంతాల్లో సెర్చ్ చేశారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఆయా వ్యాపార‌వేత్త‌ల‌కు పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌తో ఉన్న లింకుల‌పై ఆరా తీస్తున్నారు. ప‌లు సంస్థ‌ల‌కు నోటీసులు కూడా ఇచ్చారు.

ఇప్ప‌టి దాకా 18 కంపెనీలు, 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అర‌బిందో ఫార్మా, పిక్నిన్ ఎంట‌ర్ ప్రైజెస్ , శ్రీ అవంతిక కాంట్రాక్ట‌ర్స్ , ఆర్గానామిక్స ఈకో సిస్ట‌మ్స్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి.

ఇదే స‌మ‌యంలో సీఎం కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు కూడా నోటీసులు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమెకు ఆడిట‌ర్ గా గోరంట్ల బుచ్చిబాబు ఉన్నారు.

ఆయ‌న మూడు కంపెనీల‌లో డైరెక్ట‌ర్ గా ఉండ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. మొన్న క‌విత పీఏ ఇంట్లో సోదాలు చేస్తూ ఇవాళ అకౌంటెంట్ నివాసంలో దాడులు చేప‌ట్ట‌డం విశేషం.

కాగా ఆమెకు క‌రోనా సోకింద‌ని నోటీసు త‌న స‌హాయకుల‌కు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో ఉన్న లిక్క‌ర్ పాల‌సీని(Liquor Scam) ఢిల్లీ,

పంజాబ్,  ప‌శ్చిమ బెంగాల్ లో అమ‌లు చేసేలా ప్లాన్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ మొత్తం స్కాం వెనుక క‌విత హ‌స్తం ఉందంటూ ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ‌, మాజీ ఎమ్మెల్యే మంజీంద‌ర్ సిర్సా ఆరోపించారు. అయితే త‌న‌కు ఎలాంటి నోటీసు

రాలేదంటోంది బతుక‌మ్మ‌. ఈ కేసులో అనుస్ బ్యూటీ పార్ల‌ర్ రెండు రాష్ట్రాల‌ల్లో ఉంది.

దీని హెడ్ ఆఫీసుపై కూడా సోదాలు చేప‌ట్ట‌డం మ‌రింత అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా అస‌లు దోషులు ఎవ‌రో తేల్చుతుందా ఈడీ అన్న‌ది తేలాల్సి ఉంది.

Also Read : ఎన్ని దాడులు చేసినా ఏవీ దొర‌క‌వు

Leave A Reply

Your Email Id will not be published!