Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌కుమార్‌ గుప్తా !

ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌కుమార్‌ గుప్తా !

Harish Kumar Gupta: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌ కుమార్‌ గుప్తా(Harish Kumar Gupta)ను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్‌ జవహర్‌ రెడ్డికి సమాచారం అందించింది. దీనితో సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు సోమవారం మధ్యాహ్నం ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (EC) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Harish Kumar Gupta As a AP New DGP

సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకు అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఏపీ డీజీపీపై తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం… డీజీపీను ఎన్నికల విధులకు సంబంధం లేని స్థానానికి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్‌ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ ), మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌కుమార్‌ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా… ఎన్నికల సంఘం హరీశ్‌ కుమార్‌ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.

Also Read : MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు !

Leave A Reply

Your Email Id will not be published!