Radhika Khera: కాంగ్రెస్ పై రాధికా ఖేరా సంచలన ఆరోపణలు !

కాంగ్రెస్ పై రాధికా ఖేరా సంచలన ఆరోపణలు !

Radhika Khera : సార్వత్రిక ఎన్నికల వేల కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఢిల్లీ కాంగ్రెస్ ఛీప్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోగా…. కాంగ్రెస్ త్వరలో రాహుల్ గాంధీ వర్గంగా, ప్రియాంక గాంధీ వర్గంగా చీలిపోవచ్చంటూ ఆ పార్టీ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీను వీడిన రాధికా ఖేరా ఆ పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. చత్తీస్‌ గఢ్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు కాంగ్రెస్‌ నాయకులు తనను గదిలో బంధించి దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.

Radhika Khera Issues

సోమవారం విలేకరుల సమావేశంలో రాధిక మాట్లాడుతూ… ‘‘మా ఇంట్లో రాముడి జెండాను పెట్టిన రోజు నుంచి కాంగ్రెస్ నాపై దాడి చేస్తుంది. పార్టీ నాయకులు నన్ను ఎప్పుడూ అవమానిస్తూ ఉండేవారు. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ఛత్తీస్‌ గఢ్‌ లో సాగుతున్న సమయంలో మీడియా ఛైర్మన్ సుశీల్ గుప్తా తాగిన స్థితిలో మా ఇంటికి వచ్చి తలుపులు తట్టారు. నాకు మద్యం ఇవ్వాలని చూశారు. అనంతరం ఏప్రిల్‌ 30న నేను రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో సుశీల్ ఆనంద్ శుక్లాతో మాట్లాడటానికి వెళ్లాను. అప్పుడు కూడా ఆయన నన్ను దుర్భాషలాడారు. మరో ఇద్దరు నాయకులతో కలిసి నన్ను గదిలో బంధించి దాడి చేశారు. భయంతో ఎంత అరిచినా ఎవరూ తలుపు తీయలేదు. పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు’’ అని తెలిపారు.

అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించినందుకు కాంగ్రెస్‌ నేతల నుంచి తాను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు తెలుపుతూ ఆదివారం రాధికా(Radhika Khera) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖలో ‘‘మతాన్ని సమర్థించేవారికి వ్యతిరేకత ఎదురవుతుందని పురాతన కాలం నుంచి స్పష్టమవుతోంది. దీనిపై అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదేరీతిలో.. శ్రీరాముడి పేరును జపించిన వారిని ప్రస్తుతం కొందరు వ్యతిరేకిస్తున్నారు. హిందువులందరికీ రాముడి జన్మస్థలం పరమపవిత్రమైంది. రామ్‌లల్లా దర్శనంతో తమ జీవితం ధన్యమైందని ఈ మతస్థులు భావిస్తారు. కొందరు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు’’ అంటూ రాసుకొచ్చారు.

Also Read : Alamgir Alam: పని మనిషి ఇంట్లో రూ. 25 కోట్లు లభ్యం !

Leave A Reply

Your Email Id will not be published!