Challa Srishant : కాఫీ బోర్డు ఆఫ్ ఇండియా సభ్యుడిగా శ్రీశాంత్
సీసీఎల్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్
Challa Srishant : సిసిఎల్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీశాంత్(Challa Srishant) అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ లేబుల్ ఇనస్టంట్ కాఫీ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంది సీసీఎల్.
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా సభ్యునిగా ఇన్ స్టంట్ కాఫీ ప్రతినిధిగా ఎన్నికయ్యారు చల్లా శ్రీశాంత్. ఆయన నియామకం 9 సెప్టెంబర్ 2022 నుంచి అమలులోకి వస్తుంది.
చల్లా శ్రీశాంత్ 2024 – 2025 దాకా బోర్డులో మెంబర్ గా సేవలు అందించనున్నారు. ఇదిలా ఉండగా సి శ్రీశాంత్ కు అంతర్జాతీయ కాఫీ పరిశ్రమలో 18 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక జాతీయ , అంతర్జాతీయ కంపెనీలలో డైరెక్టర్ షిప్ లను కలిగి ఉన్నారు. తయారీ నుండి నిర్మాణం వరకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఇతర విభిన్న వ్యాపారాలలో భాగస్వామ్యం కలిగి ఉన్నారు.
శ్రీశాంత్ రిస్క్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ గా పని చేస్తున్నారు. అంతే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ సభ్యుడు కూడా. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం నుంచి కార్పొరేట్ లాలో బంగారు పతకాన్ని సాధించాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టాపర్ , అంతే కాదు గణితంలో బంగారు పతకం విజేతగా ఉన్నారు. ఈ సందర్భంగా చల్లా శ్రీశాంత్ మీడియాతో మాట్లాడారు. సీసీఎల్ లో మనందరికీ ఇది గర్వకారణమని పేర్కొన్నారు.
కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో సభ్యుడినైనందుకు సంతోషంగా ఉందన్నారు. భారత దేశంలో కాఫీ పరిశ్రమ వృద్దికి మార్గ నిర్దేశనం చేయడంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు చల్లా శ్రీశాంత్(Challa Srishant).
Also Read : ప్రపంచంలో అదానీ రెండో కుబేరుడు