PM Modi : మోదీ..ట్రెండ్ సెట్టర్..టార్చ్ బేరర్
విస్మరించని అరుదైన నాయకుడు
PM Modi : భారత దేశ రాజకీయాలలో మోదీకి ముందు మోదీ తర్వాత అన్నంతగా తన ప్రాభవాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు ఛాయ్ వాలాగా ప్రారంభమైన దైనందిన జీవితం అనూహ్యంగా కార్యకర్త స్థాయి నుంచి సీఎం, ప్రధాన మంత్రి దాకా ప్రస్థానం కొనసాగింది.
ఇవాళ ఆయన పుట్టిన రోజు. సరిగ్గా 1950 సెప్టెంబర్ 17న పుట్టిన నరేంద్ర మోదీ(PM Modi) 72 లోకి అడుగు పెట్టారు. భారత దేశంలో అద్భుతమైన కమ్యూనికేషన్ స్పెషలిస్టు ఎవరూ అంటే మోదీ తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు.
26 మే 2014లో పీఎంగా కొలువు తీరారు మోదీ. రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన కనుసన్నలలో పార్టీనే కాదు దేశం నడుస్తోంది.
బలమైన రాజకీయ నాయకులలో, దేశాధినేతలలో నరేంద్ర దామోదర దాస్ మోదీ ఒకరుగా గుర్తింపు పొందారు. ఆరోపణలు, విమర్శలు అన్నింటిని తట్టుకుని నిలబడటం ఆయనకే చెల్లింది.
ప్రస్తుతం మోదీ భారత దేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి పోయారు. ఆయనే ఓ బ్రాండ్ గా తనను తాను మల్చుకోవడం మోదీకే చెల్లింది. కోట్లాది భారతీయులు తమను తాము మోదీలో చూసుకుంటున్నారు.
ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన కరోనాను మోదీ సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు ప్రశంసలు అందుకుంది. నిర్ణయాత్మక, అభివృద్ధి, ఆధారిత నాయకుడిని చూసుకుంటున్నారు జనం.
భారతీయుల కలలు, ఆకాంక్షలకు ఆయన ఆశాకిరణంగా మారారు. పేదల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకు రావాలని చేసిన ప్రయత్నాలు మోదీని భారత దేశం అంతటా ప్రజాదరణ పొందిన నాయకుడిగా మార్చాయి.
ఆయన జీవన ప్రస్థానం మొత్తం ధైర్యం, సవాళ్లను స్వీకరించడం , సేవ చేయడంతో నిండి పోయింది. చిన్న వయస్సు లోనే ప్రజా సేవకు అంకితం చేశారు. గుజరాత్ సీఎంగా 13 ఏళ్ల పాటు పని చేశారు.
సుపరిపాలన అంటే ఏమిటో చూపించాడు మోదీ(PM Modi). స్వామి వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన రచనలు తనను ఎంతో ప్రభావితం చేశాయి.
17 ఏళ్ల వయస్సులో భారత దేశం అంతటా ప్రయాణించేందుకు ఇంటిని విడిచి పెట్టాడు. 1972లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా మారారు. 1987లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని చేకూర్చి పెట్టారు. 1990 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పోటీగా నిలిపేలా చేశాడు మోదీ. 1995లో అసెంబ్లీలో 121 సీట్లు గెలుచుకుంది.
1995 నుండి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. 1998లో బీజేపీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు మోదీ. ఆ తర్వాత సీఎం నుంచి పీఎం స్థాయికి ఎదిగారు. నరేంద్ర మోదీ కొలువు తీరి ఎనిమిదేళ్లవుతోంది.
కృషి , పట్టుదల, నిబద్దత ఉండాలన్నది ఆయన లక్ష్యం. అందుకే మోదీని బ్రాండ్ అంబాసిడర్ గా ట్రెండ్ సెట్టర్ గా టార్చ్ బేరర్ గా పేర్కొంటారు.
Also Read : ఈసారి అమ్మ వద్దకు వెళ్ల లేక పోయా