Chandigarh Hostel Row : వీడియోల‌ కేసులో ముగ్గురు అరెస్ట్

నిందితురాలితో మ‌రో ఇద్ద‌రు పురుషులు

Chandigarh Hostel Row : పంజాబ్ లోని చండీగ‌ఢ్ యూనివ‌ర్శిటీ హాస్ట‌ల్ కు సంబంధించిన వీడియోల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ప్ర‌ధాన నిందితురాలితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ ఇంకొక‌రిని అరెస్ట్ చేశారు. గ‌త రెండు రోజులుగా యూనివ‌ర్శిటీ ప్రాంగ‌ణం ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లి పోయింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది. విద్యార్థులు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరింది. ఈ మేర‌కు సీఎం భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఉన్న‌త స్థాయి విచార‌ణ జ‌రిపిస్తామంటూ ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న అత్యంత బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

ఈ మొత్తం వ్య‌వ‌హారానికి సంబంధించి చండీగ‌ఢ్ యూనివ‌ర్శిటీ(Chandigarh Hostel Row) వీసీ స్పందించారు. కేవ‌లం ఒక్క వీడియో మాత్ర‌మే బ‌య‌ట‌కు వెళ్లింద‌ని అంతా ఆరోపిస్తున్న‌ట్లు 60 వీడియోలు అప్ లోడ్ కాలేద‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు అస‌లైన నిందితురాలిని గుర్తించారు. త‌న స్వంత వీడియోను త‌న బాయ్ ఫ్రెండ్ కు పంపిన‌ట్లు గుర్తించామ‌న్నారు.

ఒక‌రి నుంచి మ‌రొక‌రు పుకార్ల‌ను న‌మ్మార‌ని, ఆ త‌ర్వాత ఆందోళ‌న‌కు దిగార‌ని ఎవ‌రి వీడియోలు బ‌య‌ట‌కు వెళ్ల‌లేద‌ని పోలీసు ఉన్న‌తాధికారి స్ప‌ష్టం చేశారు.

విద్యార్థినిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వోయూరిజం, ఐటీ చ‌ట్టం కింద అభియోగాలు మోపారు. ట్రావెల్ ఏజెన్సీలో ప‌ని చేస్తున్న ఆమె ప్రియుడు స‌న్నీ మెహ‌తాను సిమ్లా నుంచి అరెస్ట్ చేశారు. బేక‌రీలో ప‌ని చేస్తున్న రెండో వ్య‌క్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Also Read : 60 కాదు 4 వీడియోలు మాత్ర‌మే – విర్క్

Leave A Reply

Your Email Id will not be published!