South Africa Wants : మా డైమండ్ మాకివ్వండి – సౌతాఫ్రికా

ఇంగ్లండ్ క్వీన్ అంత్య‌క్రియ‌ల త‌ర్వాత డిమాండ్

South Africa Wants : బ్రిట‌న్ లో క్వీన్ ఎలిజ‌బెత్ -2 అంత్యక్రియ‌లు ముగిశాయి. ఆమె 70 ఏళ్ల 214 రోజుల పాటు బ్రిట‌న్ ను పాలించారు. 96 ఏళ్ల వ‌య‌స్సులో ఆమె తుది శ్వాస విడిచారు.

ఇదిలా ఉండ‌గా ఆయా దేశాల నుంచి త‌మ దేశంలో ఉంచుకున్న వ‌జ్రాల‌ను త‌మకు ఇవ్వాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాజాగా ఆ దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది.

500 క్యారెట్ గ్రేట్ స్టార్ డైమండ్ (వ‌జ్రం)ను తిరిగి ఇవ్వాల‌ని(South Africa Wants) కోరింది. చాలా మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయా దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా త‌మ వ‌జ్రాల‌ను త‌మ‌కు ఇవ్వాలంటూ కోరుతున్నారు.

పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. కాగా బ్రిటీష్ కిరీటం ఆభ‌ర‌ణాల‌లో భాగ‌మైన రాజ దండానికి గ్రేట్ స్టార్ డైమండ్ జోడించారు. క్వీన్ మ‌ర‌ణంతో ఈ డిమాండ్ మ‌రింత ఊపందుకుంది.

బ్రిటీష్ కిరీట ఆభ‌ర‌ణాల‌ను అలంక‌రించే అనేక వ‌జ్రాల‌ను తిరిగి తీసుకు రావాల‌ని పిలుపులు వ‌స్తున్నాయి. గ్రేట్ స్టార్ డైమండ్ పూర్తిగా ద‌క్షిణాఫ్రికా కు చెందిన‌ది.

ఇది అన్ని వ‌జ్రాల‌లో కంటే ఎక్కువ క్లియ‌ర్ క‌ట్ వ‌జ్రంగా పేరొందింది. 1905లో ద‌క్షిణాఫ్రికాలో ఈ డైమండ్ ను వెలికి తీశారు. గ్రేట్ స్టార్ వ‌జ్రాన్ని ఆఫ్రికా లోని వ‌ల‌స పాల‌కులు బ్రిటీష్ రాజ కుటుంబానికి దానిని అప్ప‌గించారు.

ప్ర‌స్తుతానికి రాణికి చెందిన రాజ దండంపై అమ‌ర్చారంటూ స్ప‌ష్టం చేసింది సౌతాఫ్రికా దేశం. కుల్లిన‌న్ డైమండ్ ను వెంట‌నే ద‌క్షిణాఫ్రికాకు తిరిగి ఇవ్వాల‌ని థండుక్సోలో స‌బెలో స్థానిక మీడియాతో కోరారు.

మ‌న దేశంతో పాటు ఇత‌ర దేశాల ఖ‌నిజాలు, విలువైన వ‌జ్రాలు బ్రిట‌న్ కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తున్నాయంటూ ఆరోపించారు.

Also Read : తైవాన్ కు ర‌క్ష‌ణ‌గా ఉంటాం – జో బైడెన్

Leave A Reply

Your Email Id will not be published!