Y S Vivekananda Reddy Sc : ఏపీ స‌ర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు

వివేకా హ‌త్య కేసులో కోలుకోలేని షాక్

Y S Vivekananda Reddy Sc : దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు, ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి చిన్నాయ‌న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

ఈ కేసుకు సంబంధించి బిగ్ షాక్ త‌గిలింది. ఈ కేసులో రోజు రోజుకు ట్విస్ట్ ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

ఇదిలా ఉండ‌గా వైఎస్ వివేకానంద రెడ్డి(Y S Vivekananda Reddy Sc) కూతురు సునీత ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన విచార‌ణ‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

ఈ కేసు విచార‌ణ‌కు సంబంధించి ఏపీ స‌ర్కార్ కు కాకుండా ఇత‌ర రాష్ట్రానికి అప్ప‌గించాల‌ని అప్పుడే అస‌లైన దోషులు ఎవ‌రో తేలుతుంద‌ని ఆమె పిటిష‌న్ లో పేర్కొన్నారు.

సునీత దాఖ‌లు చేసిన దావాపై జ‌స్టిస్ ఎం. ఆర్. షా , జ‌స్టిస్ కృష్ణ మురారి ధ‌ర్మానం విచార‌ణ చేప‌ట్టింది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌కు సంబంధించి స్వంత త‌న‌యురాలైన సునీత లేవ‌నెత్తిన అంశాల‌పై స‌మాధానం చెప్పాలంటూ ద‌ర్యాప్తు చేప‌ట్టిన సీబీఐతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఇదే స‌మ‌యంలో ఈ కేసుకు సంబంధించి త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 14న చేప‌ట్ట‌నున్న‌ట్లు ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. కాగా సునీత త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది సిద్దార్థ లూత్రా వాద‌న‌లు వినిపించారు కోర్టులో.

ఇదే క్ర‌మంలో కేసుకు సంబంధించి విచార‌ణ జ‌ర‌గ‌కుండా ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారులు కావాల‌ని సాక్ష్యుల‌ను బెదిరింపుల‌కు గురి చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మొత్తం వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఈ కీల‌క నోటీసులు జారీ చేసింది.

Also Read : 2023లో విశాఖ‌లో గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ల స‌మ్మిట్

Leave A Reply

Your Email Id will not be published!