Modi VS Kejriwal Comment : మోదీని కేజ్రీవాల్ ఢీకొనగలరా..?
గుజరాత్ మోడల్ వర్సెస్ ఢిల్లీ మోడల్
Modi VS Kejriwal Comment : పొలిటికల్ గేమ్ మరింత రసవత్తరంగా మారింది భారత దేశంలో. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీలన్నీ నిమగ్నమై ఉన్నాయి.
ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నప్పటికీ ప్రధాన ఫోకస్ అంతా ఎలక్షన్స్ పైనే ఉంది. బయటకు కనిపించే రాజకీయం వేరు. లోపల
జరిగే వ్యూహాలు, ప్రతివ్యూహాల ఆధారంగా కొనసాగనున్నాయి.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తో పాటు చాలా పార్టీలు దేశంలో కొలువు తీరి ఉన్నాయి. ఇక ఆక్టోపస్ లాగా దేశంలో పాతుకు పోయిన భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది.
ప్రాంతీయ పార్టీలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ , తమిళనాడులో డీఎంకే, కేరళలో సీపీఎం, ఏపీలో వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ కొలువు తీరి ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజస్థాన్ , చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సారథ్యంలో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక బీహార్ లో జేడీయూ సంకీర్ణ సర్కార్ ఉండగా జార్ఖండ్ లో
జేఎంఎం ప్రభుత్వం ఉంది.
ఇక మోదీ కొలువు తీరిన ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ పాలనా కాలంలో బీజేపీయేతర ప్రభుత్వాలు కొలువు తీరిన ఎనిమిది రాష్ట్రాలను కూల్చి వేయడంలో కీలక పాత్ర పోషించింది కేంద్రం.
దీని వెనుక మోదీ త్రయం ఉందని ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. ఇది పక్కన పెడితే దేశంలో కాంగ్రెస్ పనై పోయిందని ఇక తామే ప్రత్యామ్నాయం అంటూ చెబుతూ వస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Modi VS Kejriwal) .
ప్రస్తుతం ఆయన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ , తదితర రాష్ట్రాలలో ఫోకస్ పెట్టారు. దేశ వ్యాప్తంగా ఆప్ జెండా ఎగుర వేయాలని కలలు కంటున్నారు.
ఇదే సమయంలో తానే మోదీకి ప్రత్యామ్నాయం నేతగా తనను తాను ప్రొజెక్టు చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. మోదీ ప్లాన్ వేరుగా ఉంటుంది.
ఆయన మదిలో ఏముందో ఎవరూ చెప్పలేరు. తన పార్టీకి చెందిన వారికి కూడా తెలియదు. అంత నర్మగర్భంగా ఉంటుంది మోదీ వ్యవహారశైలి. ప్రచారంలో మోస్ట్ పాపులర్ లీడర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.
మరో వైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేందుకు ప్లాన్ చేశారు. భారత్ జోడో యాత్ర చేపట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత క్యాడర్ , మందీ మార్బలం ఆప్ కు లేదు. ఇదే సమయంలో బీజేపీ చాప
కింద నీరులా పార్టీని విస్తరించే పనిలో పడింది.
మరో వైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఛాయ్ వాలా గా పని చేసి సీఎంగా, పీఎం స్థాయికి ఎదిగారు మోదీ.
ఇక కేజ్రీవాల్ వరకు చూస్తే ఢిల్లీ మోడల్ అమలు చేస్తానంటున్నారు. గతంలో దేవె గౌడ, ఐకే గుజ్రాల్ ను పీఎంగా ఏకాభిప్రాయం సాధించారు. కాని అలాంటి ప్రతిపాదనలు కేజ్రీవాల్ విషయంలో ఉండక పోవచ్చు. ఆయన ఎవరితోనూ కలవడు. ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించడు.
తన స్వంత పార్టీ ఆప్ లో అసమ్మతిని ఒప్పుకోడు. ఈ తరుణంలో కేజ్రీవాల్ ఎలా జాతీయ నాయకుడిగా ఎదుగుతాడనేది ప్రశ్నార్థకంగా మారింది.