ABG Ship Yard Chief Arrest : ఏబీజీ షిప్ యార్డ్ చీఫ్ అరెస్ట్

రూ. 22,842 కోట్లకు పైగా బ్యాంకు మోసం

ABG Ship Yard Chief Arrest : భార‌త దేశంలోనే అతి పెద్ద బ్యాంకు మోసానికి పాల్ప‌డిన కేసులో ఏబీజీ షిప్ యార్డ్ కు చెందిన వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ రిషి క‌మ‌లేష్ అగ‌ర్వాల్ ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది.

వివిధ బ్యాంకుల‌కు కుచ్చు టోపీ పెట్టారు. ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు రూ. 22, 842 కోట్లకు పైగా మోసం చేసిన‌ట్లు గుర్తించింది.

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) కంపెనీ మాజీ చైర్మ‌న్ అగ‌ర్వాల్ తో పాటు ఇత‌రుల‌పై నేర పూరిత కుట్ర‌, మోసం నేర పూరిత విశ్వాస ఉల్లంఘ‌న కింద కేసు న‌మోదు చేసింది.

భార‌తీయ శిక్షా స్మృతి (ఐపీసీ) , అధికారిక ప‌ద‌విని దుర్వినియోగం చేయ‌డం వంటి నేరాల‌కు సంబంధించి అభియోగాలు మోపింది. పూర్తిగా అధికారిక దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ట్లు స్ప‌ష్టం చేసింది సీబీఐ.

ఈ కేసులో భార‌తదేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ. 2,468.52 కోట్ల మోసానికి పాల్ప‌డ్డాడు ఏబీజీ షిప్ యార్డు చీఫ్‌(ABG Ship Yard Chief Arrest ).

ఎస్బీఐతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలోని 28 బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థ‌ల నుండి కంపెనీ క్రెడిట్ సౌక‌ర్యాలు పొందాయి. ఎర్నెస్ట్ , యంగ్ చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ 2012 నుండి 2017 మ‌ధ్య నిందితులు ఒక‌రితో మ‌రొక‌రు కుమ్మ‌క్క‌య్యారంటూ ఆరోపించింది సీబీఐ.

అంతే కాకుండా నిధుల మ‌ళ్లింపు , దుర్వినియోగం, నేర పూరిత విశ్వాస ఉల్లంఘ‌న‌తో స‌హా చ‌ట్ట విరుద్ద‌మైన కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డార‌ని తేలింది.

ఈ నిధుల‌ను బ్యాంకులు విడుద‌ల చేసిన‌వే కాకుండా ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగించిన‌ట్లు సీబీఐ ఆరోపించింది.

Also Read : సీఎం జ‌గ‌న్ తో టాటా స‌న్ చైర్మ‌న్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!