Smriti Mandhana : వన్డేల్లో స్మృతీ మంధాన అరుదైన ఘనత
శిఖర్ ధావన్..విరాట్ కోహ్లీ తర్వాత స్మృతీ
Smriti Mandhana : ప్రపంచ మహిళా క్రికెట్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకుంది స్మృతీ మంధాన(Smriti Mandhana). ప్రస్తుతం తన ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటోంది.
భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన స్మృతీ మంధాన ఇటీవల ఆట పరంగా దుమ్ము రేపుతోంది. పరుగుల వరద పారిస్తోంది.
ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తోంది మంధాన. తాజాగా వన్డే ఫార్మాట్ లో అరుదైన ఘనతను సాధించింది. తనకు ఇక ఎదురే లేదని చాటింది.
ఇక భారత క్రికెట్ జట్టులో పురుష, మహిళల పరంగా వన్డే కెరీర్ లో అత్యధికంగా పరుగులు సాధించిన క్రికెటర్లలో శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ కాగా ఆ ఇద్దరి సరసన క్రికెట్ బ్యూటీగా పేరొందిన స్మృతీ మంధాన(Smriti Mandhana) నిలిచింది.
అత్యంత వేగంగా పరుగులు చేసిన క్రికెటర్ గా చరిత్ర లిఖించింది. రికార్డు పరంగా చూస్తే శిఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్ లలో 3,000 రన్స్ చేశాడు.
ఇక విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్ లు పట్టింది మూడు వేల పరుగులు చేసింది. ధావన్ కంటే కోహ్లీ మరో మూడు మ్యాచ్ లు ఎక్కువగా ఆడాడు.
ఇక స్మృతీ మంధాన 76 ఇన్నింగ్స్ లలో 3,000 పరుగులు సాధించింది ఔరా అనిపించేలా చేసింది. ఇక మంధాన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా పేరొందారు.
ఓపెనర్ గా తన వన్డే కెరీర్ ను 2013లో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి నేటి దాకా కంటిన్యూగా ఆడుతూ వస్తోంది. మొత్తం ఇక మూడు వేల క్లబ్ లో 3 సెంచరీలు 24 హాఫ్ సెంచరీలు చేసింది స్మృతీ మంధాన.
Also Read : ఆసియా కప్ కోసం భారత మహిళా జట్టు