Angelina Jolie : పాకిస్తాన్ విపత్తు ప్రపంచానికి హెచ్చరిక – జోలీ
కంటతడి పెట్టిన హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా
Angelina Jolie : హాలీవుడ్ స్టార్, మానవతావాది ఏంజెలీనా జోలీ(Angelina Jolie) కంటతడి పెట్టారు. పాకిస్తాన్ దేశాన్ని ఇటీవల వరదలు తీవ్రస్థాయిలో ముంచెత్తాయి. 70 వేలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి.
1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా తీవ్రంగా నష్ట పోయిన పాకిస్తాన్ ను ఏంజెలీనా జోలీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాధితులను పరామర్శించి మాట్లాడారు.
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు దేశంలోని మూడవ వంతును ముంచెత్తింది. ఇలాంటి విషాదాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు ఏంజెలీనా జోలీ.
పాకిస్తాన్ లో చోటు చేసుకున్న ఈ విపత్తు యావత్ ప్రపంచానికి ఓ మేల్కొలుపు అని పేర్కొన్నారు. బాధితులతో సంభాషించిన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాతలు ఆదుకోవాలని ఏంజెలీనా పిలుపునిచ్చారు.
ఏడు మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. చాలా మంది ఇళ్లను , నివాస స్థలాలను కోల్పోయారు. ఎక్కడ చూసినా నీళ్లే నిలిచి ఉన్నాయి.
బాధితుల ఆక్రందనలు, ఆర్తనాదాలతో పాకిస్తాన్ హోరెత్తుతోంది. కనీసం తాగేందుకు సైతం తాగు నీరు అందడంలేదు.
ఇదిలా ఉండగా హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ(Angelina Jolie) 2010లో వరదలు, 2005లో సంభవించిన భూకంపం సంభవించిన సమయంలో పాకిస్తాన్ ను సందర్శించారు. తాను ఇలాంటి విపత్తును ఎన్నడూ చూడలేదన్నారు హాలీవుడ్ స్టార్.
కీలక వ్యాఖ్యలు చేశారు జోలీ. అంతర్జాతీయ సమాజాన్ని మరింత ముందుకు తీసుకు రావడానికి నేను మీతో ఉన్నానని స్పష్టం చేశారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఇస్లామాబాద్ లో జరిగిన పౌర, సైనిక అధికారుల సమావేశంలో ప్రసంగించారు.
Also Read : ఎందుకు ఇష్ట పడుతున్నారో తెలియదు