Sourav Ganguly : 2023లో మహిళల ఐపీఎల్ – గంగూలీ
కీలక ప్రకటన చేసిన బీసీసీఐ బాస్
Sourav Ganguly : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాస్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కీలక ప్రకటన చేశారు. మహిళల ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) ను వచ్చే ఏడాది 2023లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఈ విషయాన్ని తెలియ చేశామన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ విమెన్స్ ఐపీఎల్ ను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
2022-23 కోసం స్వదేశీ అంతర్జాతీయ, దేశీయ సీజన్లపై ముఖ్యమైన అంశాలను వివరించారు. ఈ మేరకు ఆయా క్రికెట్ అసోసియేషన్లకు లేఖలు కూడా రాశామని తెలిపారు.
మహిళా ఐపీఎల్ పై బీసీసీఐ కసరత్తు చేస్తోందని అందులో పేర్కొన్నారు సౌరవ్ గంగూలీ. ఈ ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ టోర్నీకి సంబంధించి త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తామన్నారు బీసీసీఐ బాస్.
పురుషుల ఐపీఎల్ మాదిరిగానే మహిళా ఐపీఎల్ ఉంటుందన్నారు. గత ఏడాది ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ముంబై, పూణేలలో నాలుగు వేదికలుగా జరగగా నాకౌట్ మ్యాచ్ లు కోల్ కతా, అహ్మదాబాద్ లలో జరిగాయని వెల్లడించారు గంగూలీ(Sourav Ganguly).
ఇదిలా ఉండగా ఇప్పటికే ఐపీఎల్ లో ఉన్న జట్లకు ప్రాంచైజీలే మహిళల జట్లకు కూడా స్పాన్సరర్ గా ఉంటాయని పేర్కొన్నారు గంగూలీ.
ఈసారి ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఊహించని రీతిలో కప్పు గెలుచుకుంది. ఇక చాలా ఏళ్ల తర్వాత సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ రన్నర్ అప్ గా నిలిచింది. మొత్తంగా ఇవాళ గంగూలీ చేసిన ప్రకటన క్రికెట్ వర్గాలలో కలకలం రేపింది.
Also Read : వన్డేల్లో స్మృతీ మంధాన అరుదైన ఘనత