Navika Kumar SC : న‌వికా కుమార్ కు సుప్రీం ఊర‌ట

కేసుల‌న్నీ ఢిల్లీ కోర్టుకు బ‌దిలీకి ఆదేశం

Navika Kumar SC :  భార‌త దేశంలో మోస్ట్ పాపుల‌ర్ జ‌ర్న‌లిస్ట్ యాంక‌ర్ల‌లో న‌వికా కుమార్(Navika Kumar) ఒక‌రుగా ఉన్నారు. ఆమె చ‌ర్చ‌లు చేప‌ట్ట‌డంలో, ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌డంలో దిట్ట‌. ఇదిలా ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన బ‌హిష్కృత నాయ‌కురాలు నూపుర్ శ‌ర్మ తో సంభాషించింది.

న‌వికా కుమార్ డిబేట్ లో నూపుర్ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. ఆమెపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు మిన్నంటాయి.

నూపుర్ శ‌ర్మ‌తో పాటు టీవీ యాంక‌ర్ న‌వికా కుమార్(Navika Kumar) పై కూడా దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో కేసులు న‌మోద‌య్యాయి. దీంతో తాను అన్ని ప్రాంతాల‌కు వెళ్ల‌లేనంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది టీవీ యాంక‌ర్ న‌వివా కుమార్.

ఇందుకు సంబంధించి దాఖ‌లైన పిటిష‌న్ పై కోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. త‌న‌పై న‌మోదు అయిన కేసుల‌ను తాను ఎదుర్కోవాలంటే జీవిత కాలం స‌రిపోద‌ని పేర్కొంది.

తాను కావాల‌ని చ‌ర్చ పెట్ట‌లేదంటూ స్ప‌ష్టం చేసింది. త‌న‌పై న‌మోదు చేసిన కేసుల‌న్నింటిని ఒకే చోటుకు చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరింది. దావాను విచారించిన కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

న‌వికా కుమార్ ఆవేద‌న‌ను అర్థం చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కేసుల‌న్నింటిని ఢిల్లీ హైకోర్టుకు బ‌దిలీ చేయాల‌ని కోర్టు ఆదేశించింది. జ‌స్టిస్ ఎం.ఆర్. షా, కృష్ణ మురారీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పు చెప్పింది.

అంతే కాకుండా ఎనిమిది వారాల పాటు న‌వికా కుమార్ పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవద్దంటూ కూడా ఆదేశించింది. అంతే కాకుండా కేసుల కొట్టి వేత విష‌యంలో కూడా కోర్టును ఆశ్ర‌యించవ‌చ్చంటూ స్ప‌ష్టం చేసింది కోర్టు.

Also Read : అజ‌హ‌రుద్దీన్..హెచ్‌సీఏపై కేసు న‌మోదు

Leave A Reply

Your Email Id will not be published!