PM Modi NIA : మోదీ హ‌త్య‌కు పీఎఫ్ఐ కుట్ర – ఎన్ఐఏ

మ‌నీల్యాండ‌రింగ్ కింద రూ. 120 కోట్లు

PM Modi NIA : జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi NIA) హ‌త్య‌కు కుట్ర ప‌న్నిందంటూ వెల్ల‌డించింది.

ఇందుకు సంబంధించి పీఎం హ‌త్య‌తో పాటు దేశంలో విధ్వంస‌క కార్య‌క‌లాపాలు సృష్టించేందుకు గాను ఇప్ప‌టి దాకా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రూ. 120 కోట్లు స‌మీక‌రించింద‌ని వెల్ల‌డించింది ఎన్ఐఏ.

దేశమంత‌టా విద్వేషాలు, విధ్వంసాలు సృష్టించేందుకు యువ‌కుల‌కు క‌రాటే పేరుతో శిక్ష‌ణ ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేసింది.

ప్ర‌ధానంగా ప్ర‌ధాన‌మంత్రిని అంతమొందించేందుకు పీఎఫ్ఐ స‌భ్యులు తీవ్ర‌వాద శిబిరాన్ని నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారంటూ సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట పెట్టింది ఎన్ఐఏ.

ఈ ఏడాది జూలై 12న బీహార్ రాజ‌ధాని పాట్నాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi) ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భంగం క‌లిగించే ఉద్దేశంతో శిక్ష‌ణా శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎన్ఐఏ,సీబీఐ, ఈడీ ఎఫ్ఐఏకు వ్య‌తిరేకంగా అన్ని ఆధారాలు సేక‌రించిన‌ట్లు తెలిపింది.

పీఎఫ్ఐ పెద్ద మొత్తంలో న‌గ‌దు వ‌సూలు చేసింద‌ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వెల్ల‌డించింది. ద‌ర్యాప్తు సంద‌ర్భంగా పీఎఫ్ఐ సంస్థ‌కు చెందిన అనేక బ్యాంకు ఖాతాల వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి.

ఇవ‌న్నీ మ‌నీ ల్యాండ‌రింగ్ కు సంబంధించిన‌వ‌ని తేలింద‌ని ఈడీ స్ప‌ష్టం చేసింది. కేర‌ళ‌కు చెందిన మ‌హ‌మ్మ‌ద్ షఫీక్ పాయెత్ ను, ఢిల్లీలోని ప‌ర్వేజ్ మ‌హ్మ‌ద్ ల‌ను ప్ర‌త్యేక కోర్టుల ముందు హాజ‌రు ప‌ర్చిన‌ట్లు ఎన్ఐఏ తెలిపింది.

దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల‌కు 106 మంది పీఎఫ్ఐ స‌భ్యుల‌ను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ.

Also Read : చైనాలో సైనిక తిరుగుబాటు

Leave A Reply

Your Email Id will not be published!