Suella Braverman : సుయెల్లెకు క్వీన్ ఎలిజబెత్ -2 అవార్డు
భారత సంతతికి చెందిన బ్రేవర్ మన్
Suella Braverman : భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేమర్ మన్(Suella Braverman) కు అరుదైన పురస్కారం దక్కింది. ఆమె యునెటెడ్ కింగ్ డమ్ లో మంత్రిగా ఉన్నారు. మొట్ట మొదటిసారిగా క్వీన్ ఎలిజబెత్ II అవార్డును గెలుచుకున్నారు.
ప్రస్తుతం బ్రిటీష్ హోం సెక్రటరీగా ఉన్నారు సుయెల్లా బ్రేవర్ మన్ . తొలిసారిగా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు. 42 ఏళ్ల భారత సంతతికి చెందిన మంత్రి పేరెంట్స్ లండన్ వేడుకలో ఆమె తరపున పురస్కారాన్ని స్వీకరించారు.
మాజీ అటార్నీ జనరల్ గా పని చేశారు. కొత్తగా హొం సెక్రటరీ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆసియన్ అచీవర్స్ అవార్డు ట్వీట్ చేసింది.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. యునైటెడ్ కింగ్ డమ్ లోని దక్షిణ ఆసియన్లు ఇవాళ రాజకీయాలు, వ్యాపారం, పౌర సమాజంతో సహా అనేక రంగాలలో నాయకత్వ స్థానాలను ఆక్రమించారు.
2000లో ప్రారంభమైన నాటి నుండి ఆసియన్ అచీవర్స్ అవార్డ్స్ దక్షిణాసియా కమ్యూనిటీలో అటువంటి వ్యక్తులకు సంబంధించిన అత్యుత్తమ పనిని గుర్తిస్తుంది.
ఇదిలా ఉండగా ఆమె ఈ అత్యున్నత అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి వెల్లడించింది.
జాతి లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా సాధించేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం యుకె అని సుయెల్లా బ్రేవర్ మన్(Suella Braverman) అన్నారు.
ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. జాతి లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా సాధించేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం ఇది.
ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని గ్రహించేందుకు సహకరించేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
Also Read : రిచ్ లిస్ట్ లో నేహా నార్ఖేడ్ రికార్డ్