Nirmala Sitharaman : ఆర్థిక మంత్రి షాకింగ్ కామెంట్స్
రూపాయి విలువపై ప్రభావం కంటిన్యూ
Nirmala Sitharaman : దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రక్షణ విలువ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరింది.
అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి 30 పైసలు క్షీణించి 81.09 వద్ద జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉండగా డాలర్ తో రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయికి పడిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
అయితే ఇతర దేశాలతో పోలిస్తే ప్రధానంగా అమెరికాతో సరి చూసుకుంటే రూపాయి విలువ మరింత దిగజారిందని ఆర్థిక మంత్రి పేర్కొనడం చర్చకు దారితీసింది.
రిజర్వ్ బ్యాంక్ , ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిణామాలపై చాలా నిశితంగా గమనిస్తున్నాయని పేర్కొన్నారు. దేశీయ కరెన్సీ గ్రీన్ బ్యాక్ కు వ్యతిరేకంగా జీవితకాల కనిష్టానికి పడి పోవడంపై ఆర్థిక మంత్రి(Nirmala Sitharaman) స్పందించారు.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ఇతర కరెన్సీలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు కంచుకోటగా ఉన్న పూణె జిల్లాలో నిర్మలా సీతారామన్ పర్యటించారు.
ఇదే సమయంలో రూపాయి వాల్యూ క్షీణత గురించి మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు ఆర్థిక మంత్రి. యుఎస్ డాలర్ తో ఇతర కరెన్సీలు ఎలా ప్రవర్తిస్తున్నాయనే దానిపై అధ్యయనం చేయాలంటూ సూచించారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేయడం ద్వారా భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీని కారణంగానే రూపాయి ధర క్షీణించిందని పేర్కొన్నారు విత్త మంత్రి.
Also Read : జల్ బోర్డులో అవినీతిపై నివేదిక ఇవ్వండి