AP TOPS : డిజిటల్ హెల్త్ సర్వీసెస్ లో ఏపీ టాప్
అరుదైన ఘనత సాధించిన రాష్ట్రం
AP TOPS : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరదైన ఘనత సాధించింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)తో దేశంలోనే ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
తాజాగా హెల్త్ సెక్టార్ లో కీలక భూమిక పోషిస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ హెల్త్ రికార్డ్స్ లో ఏపీ అగ్ర స్థానంలో(AP TOPS) నిలిచింది.
ఏకంగా ఏబీడీఎంకి లింక్ చేసిన వారిలో కోటి మందికి పైగా చేర్చింది. ఇది అద్భుతమైన రికార్డు నమోదు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ వైద్య, కుటుంబ ఆరోగగ్య శాఖ డిజిటల్ ఆరోగ్య సేవలలో మరో ముందడుగు వేసింది.
ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ జీఎస్ నవీన్ కుమార్ వెల్లడించారు.
ఏఎన్ఎం, ఆశా వర్కర్ల వంటి క్షేత్ర స్థాయి సిబ్బంది సహకారంతో 3.4 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అథారిటీ రికార్డులను రాష్ట్ర ప్రజలకు అందజేసినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు డిజిటలైజేషన్ ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. రోగులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయని స్పష్టం చేశారు.
అవసరమైన సమయంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించ వచ్చని అన్నారు. పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనా సంస్థలు ఈ కసరత్తులో పాల్గొన్నాయని పేర్కొన్నారు డైరెక్టర్.
ఈ కేంద్రాలన్నీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎకో సిస్టమ్ ఆఫ్ డేటా లింకింగ్ లో భాగంగా మారాయని దేశంలో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపారు.
Also Read : మా ప్రయత్నం ఫలించింది – భగవంత్ మాన్