BCCI Election 2022 : బీసీసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల
బీసీసీఐ వార్షిక సమావేశం ముంబైలో
BCCI Election 2022 : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎన్నికల(BCCI Election 2022) అధికారి షెడ్యూల్ ను ప్రకటించారు.
ఈనెల 24న ఆయా రాష్ట్ర సంఘాలకు ఏడు పేజీలతో లేఖ పంపింది. ఆయా రాష్ట్రాల యూనిట్లు తమ సభ్యులను ప్రతిపాదించేందుకు గడువు ఉంది. అక్టోబర్ 11, 12 తేదీలలో నామినేషన్లకు గడువు విధించింది.
ఇదిలా ఉండగా బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం అక్టోబర్ 18న ముంబైలో జరగనుంది. ప్రతినిధులుగా ఉండాలనుకునే వారు ఆయా సంఘాలు నామినేట్ చేసేందుకు దరఖాస్తులు సమర్పంచాల్సి ఉంటుంది.
సభ్యులు తమ ప్రతినిధిని నామినేట్ చేసేందుకు దరఖాస్తులను ఫైల్ చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 4గా నిర్ణయించారు. అక్టోబర్ 5న ఎవరెవరు ఉన్నారనే దానని విడుదల చేస్తుంది.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పేర్లపై అభ్యంతరాలు ఉంటే వాటిపై సమర్పించేందుకు తుది గుడువు అక్టోబర్ 6, 7 గా నిర్ణయించింది బీసీసీఐ. అభ్యంతరాలు, నిర్ణయాల పరిశీలన తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 10న విడుదల చేస్తుంది.
వ్యక్తిగతంగా దాఖలు చేసేందుకు అక్టోబర్ 11, 12 తేదీలు గా నిర్ణయించింది. మొత్తం నామినేషన్ దరఖాస్తుల పరిశీలన అక్టోబర్ 13న జరుగుతుంది. అనంతరం తుది పరిశీలన అనంతరం చెల్లుబాటు అయ్యే నామినేట్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుంది.
నామినేషన్లను ఉపసంహరించేందుకు అక్టోబర్ 14. పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటన అక్టోబర్ 15. అనంతరం బీసీసీఐ ఎన్నికలు అక్టోబర్ 18న జరుగుతాయి. జే షా వర్సెస్ గంగూలీ లలో ఎవరు ఉంటారనేది తేలనుంది.
Also Read : మన్కడ్ వ్యవహారంపై ఎడతెగని రగడ