IND vs AUS 3rd T20 : చెలరేగిన సూర్య సత్తా చాటిన కోహ్లీ
ఉప్పల్ లో ఆసిస్ పై భారత్ గ్రాండ్ విక్టరీ
IND vs AUS 3rd T20 : సూర్య కుమార్ యాదవ్ చెలరేగితే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సత్తా చాటడంతో భారత జట్టు(IND vs AUS 3rd T20) ఆస్ట్రేలియాపై మూడో టి20 మ్యాచ్ లో విజయాన్ని నమోదు చేసింది.
2-1 తేడాతో సీరీస్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ రేపింది. మూడు మ్యాచ్ లకు గాను
మొహాలీలో ఆసిస్ బోణీ కొడితే నాగ్ పూర్ లో సత్తా చాటింది భారత్.
ఇక కీలకమైన ఈ మ్యాచ్ పూర్తిగా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. అశేష క్రికెట్ అభిమానుల కేరింతల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. చివరి దాకా నినాదాలతో హోరెత్తింది.
నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వం అసాధారణమైన రీతిలో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. 2,500 మందికి పైగా పోలీసులను మోహరించింది.
ఇరు జట్ల ఆటగాళ్లకు దేశంలో ఎక్కడా లేని రీతిలో భద్రత కల్పించింది. ఏ ఒక్కరినీ దరిదాపుల్లోకి వెళ్లకుండా చేసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే
టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఆస్ట్రేలియా ప్రారంభం నుంచే దూకుడు పెంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 187 రన్స్ చేసింది. ఆసిస్ క్రికెటర్ కామెరాన్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. టపా టపా వికెట్లు పడుతున్నా ఎక్కడా తగ్గలేదు ఆసిస్. టిమ్ డేవిడ్ 54 రన్స్ తో ఆకట్టుకున్నాడు.
అనంతరం 188 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ పోగొట్టుకుంది. నాగ్ పూర్ లో దంచి కొట్టిన రోహిత్ ఈ
మ్యాచ్ లో 17 పరుగులకే చాప చుట్టేశాడు.
మైదానంలోకి దిగిన సూర్య కుమార్ యాదవ్, కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడుతూ వచ్చారు. సూర్య కుమార్ 69 పరుగులు చేస్తే కోహ్లీ 63 రన్స్ చేశారు.
Also Read : బీసీసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల