PM Modi Tribute : షింజో అబేకు ప్రధాని మోదీ నివాళి
ప్రపంచ అరుదైన నాయకులలో ఒకరు
PM Modi Tribute : జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు(PM Modi Tribute) అర్పించారు. మంగళవారం జపాన్ కు చెందిన ప్యూమియో కిషిదాతో సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో దివంగత నాయకుడు షింజో అంబే చేసిన కృషిని, ప్రత్యేకంగా అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేకంగా గుర్తు చేశారు.
షింజో అంబే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని అగంతకుడి చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఆయన హయాంలో భారత్ , జపాన్ దేశాల మధ్య స్నేహం మరింత పెరిగింది. ఇదే సమయంలో షింజో అబేకు గౌరవ సూచకంగా గత జూలై 9న భారత దేశం ఒక రోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది.
షింజో అబే భార్య అకీ అతడి చితా భస్మాన్ని టోక్యో హాల్ లోకి తీసుకు వెళ్లారు. అక్కడ వేలాది మంది ఆయనకు నివాళులు అర్పించారు. దీనికి సంబంధించి భారీగా ఖర్చు చేయడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. జపనీస్ లో దాదాపు 60 శాతం మంది ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఉన్నారు.
ఇదిలా ఉండగా షింజో అబే జపాన్ లో ఎక్కువ కాలం పని చేసిన ప్రధానమంత్రి. దేశం గుర్తించదగిన నాయకులలో ఒకరు. అంతర్జాతీయ పొత్తులలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ప్రియమైన స్నేహితుడు. భారత్ జపాన్ స్నేహానికి గొప్ప ఛాంపియన్ అని పేర్కొన్నారు ప్రధాన మంత్రి.
Also Read : చైనా ఒంటరిగా ఫీలవుతోంది – అదానీ