HCA : వివాదాలమయం ముగిసిన పదవీకాలం
సుప్రీంకోర్టు సూపర్ వైజరీ కమిటీ ఏర్పాటు
HCA : భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను సమకూర్చి పెట్టడమే కాదు తన మణికట్టు మాయజాలంతో లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్(Mohammad Azharuddin)
పదవీ కాలం ముగిసింది. క్రికెటర్ గా ఎంతో ఉద్దరిస్తాడని ఆయనకు పదవిని కట్టబెట్టారు. చివరకు అభాసు పాలయ్యారు.
నిత్యం ఆరోపణలు, విమర్శలు, కేసులతో పదవీ కాలం పూర్తయ్యింది. అంతే కాదు లేక లేక మూడేళ్ల తర్వాత హైదరాబాద్ లో నిర్వహించిన టి20 మ్యాచ్ కూడా వివాదాస్పదంగా మారింది. మూడు కేసులతో ముగిసింది. టికెట్ల వ్యవహారం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కట చోటు చేసుకోవడం విస్తు పోయేలా చేసింది.
ఏది ఏమైనా అజహరుద్దీన్ తనకు ఉన్న పేరును పోగొట్టుకున్నాడనే చెప్పక తప్పదు. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో బయట పడినా ఈరోజు వరకు ఆయనకు రావాల్సిన డబ్బులు బీసీసీఐ నుంచి రాలేదు. తన సారథ్యంలో ఆడిన గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాడు. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. లక్ష్మణ్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు.
కానీ అజహరుద్దీన్ తన స్థాయికి తగని రీతిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు(HCA) పోటీ పడ్డాడు. లేని విమర్శలకు జవాబులు ఇవ్వలేక తడబడ్డాడు. రాజకీయం వేరు క్రికెట్ వేరు అన్నది అజ్జూ భాయ్ తెలుసుకుంటే మంచిది. ఇక సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ కార్యకలాపాలను నలుగురు సభ్యులతో కూడిన సూపర్ వైజరీ కమిటీ పర్యవేక్షిస్తుంది.
రిటైర్డ్ జడ్జి కక్రూ, ఏసీబీ డీజీ అంజనీకుమార్, మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, వంకా ప్రతాప్ సభ్యులను నియమించింది. తదుపరి కొత్త కార్యవర్గం ఎన్నికయ్యేంత దాకా వీరు పర్యవేక్షిస్తారు.
Also Read : కుల్దీప్ కమాల్ కీవీస్ ఢమాల్