Congress President Poll : త్రిముఖ పోటీకి మల్లికార్జున్ ఖర్గే రెడీ
ఎవరు గెలిచినా గాంధీ ఫ్యామిలీదే హవా
Congress President Poll : ఎవరు ఎప్పుడు ఉంటారో ఉండరోనన్న సందిగ్ధ స్థితికి ఇప్పుడు కేరాఫ్ గా మారి పోయింది కాంగ్రెస్ పార్టీ(Congress President Poll ). 134 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఆ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా పోటీని ఎదుర్కొంటోంది.
మొదటి నుంచీ నెహ్రూ కాలం నుంచి నేటి సోనియా గాంధీ దాకా గాంధీ ఫ్యామిలీ చేతిలోనే ఉంది పార్టీ. కాంగ్రెస్ అంటే ఇందిర ఇందిర అంటే కాంగ్రెస్ అన్నంతగా మారి పోయింది. ఈ తరుణంలో 20 ఏళ్ల తర్వాత గాంధీ ఫ్యామిలీ లేకుండా ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి.
సెప్టెంబర్ 30 నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ. ఇప్పటి వరకు ఎవరు బరిలో ఉంటారనేది పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వలేక పోయింది. ఇదిలా ఉండగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ సీఎంలు కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.
చివరి నిమిషంలో గెహ్లాట్ , కమల్ నాథ్ పేర్లు లేక పోగా కొత్త పేరు డిగ్గీ రాజాది చోటు చేసుకుంది. ఇదే క్రమంలో ఉన్నట్టుండి రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రకటించింది.
పోటీ పరంగా చూస్తే దిగ్విజయ్ సింగ్ తో పాటు మల్లికార్జున్ ఖర్గే నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి మనీష్ తివారీ, శశి థరూర్ బరిలో ఉండనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు ప్రకటించారు.
ఈ ఇద్దరు అసమ్మతి గ్రూపు జి-23కి చెందిన వారు. ఇక మొత్తం 9,000 మంది సభ్యులు ఉన్న పార్టీలో ఎవరు గెలుస్తారు అనే దానికంటే ఫైనల్ లిస్టులో ఎవరు ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : రాజస్థాన్ సంక్షోభం టీ కప్పులో తుపాను