Congress President Poll : కాంగ్రెస్ లో గాంధీయేతర అధ్యక్షులు
అక్టోబర్ 17న పార్టీ చీఫ్ ఎన్నికలు
Congress President Poll : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీగా కాంగ్రెస్ కు ఉంది. ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి 134 ఏళ్లు పూర్తయ్యాయి. పార్టీ ప్రారంభం నుంచి గాంధీ ఫ్యామిలీకి చెందిన వారు పార్టీని శాసిస్తూ వచ్చారు.
తాజాగా ఈ ఏడాది అక్టోబర్ 17న పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు(Congress President Poll). ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది పార్టీ.
నామినేషన్ పత్రాలలు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 30 ఆఖరు. ఇక పార్టీ పరంగా గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారే చీఫ్ లుగా
ఎన్నికవుతూ వచ్చారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ తాను ఎన్నికల బరిలో ఉండడం లేదని ప్రకటించారు
తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మధ్య ప్రదేశ్ మాజీ సీఎంలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ ల పేర్లు చివరి దాకా వినిపించాయి. కానీ ఆఖరులో తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఊహించని రీతిలో ఆ ముగ్గురికి షాక్ ఇచ్చింది.
తెరపైకి కొత్త పేరును తీసుకు వచ్చారు. గత కొంత కాలంగా గాంధీ కుటుంబంలో సభ్యుడిగా , నమ్మకమైన వ్యక్తిగా పేరొందారు కర్ణాటకకు చెందిన సీనియర్
నాయకుడు, రాజ్యసభ పార్టీ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. చివరి నిమిషంలో ఆయన పేరును పార్టీ ప్రకటించింది. ఇదిలా ఉండగా నాన్ గాంధీ ఫ్యామిలీ
నుంచి ఎన్నికైన వారి జాబితా చూస్తే ఇలా ఉంది.
1948 నుంచి 1949 దాకా మొదటి పార్టీ చీఫ్ గా పట్టాభి సీతారామయ్య ఉన్నారు. 1950 నుంచి పురుషోత్తం దాస్ టాంన్ , 1960 నుంచి 1963 దాకా నీలం సంజీవ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగారు.
1964 నుంచి 1967 దాకా కామరాజ్ , 1968 నుంచి 1969 వరకు సిద్దవనల్లి నిజలింగప్ప , 1970 నుంచి 1971 దాకా జగ్జీవన్ రామ్ చీఫ్ గా కొనసాగారు. 1972
నుంచి 1974 దాకా శంకర్ దయాల్ శర్మ, 1975 నుంచి 1977 దాకా దేవనకాంత బారువా, 1992 నుంచి 1996 దాకా పీవీ నరసింహారావు, 1996 నుంచి 1998 వరకు సీతారాం కేసరి పార్టీ అధ్యక్షులుగా పని చేశారు.
Also Read : మోదీకి ఉన్న బలం అదే – శశి థరూర్