T20 World Cup 2022 : టి20 వరల్డ్ కప్ గెలిస్తే కాసులే కాసులు
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడి
T20 World Cup 2022 : యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న టి20 వరల్డ్ కప్ రానే వచ్చింది. అక్టోబర్ 16న వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రైజ్ మనీని విడుదల చేసింది.
నవంబర్ 13న మెల్ బోర్న్ లో జరిగే ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ 2022(T20 World Cup 2022) విజేతగగా నిలిచిన జట్టు $1.6 మిలియన్ల ప్రైజ్ మనీని అందుకుంటుంది. రన్నరప్ గా నిలిచిన జట్టు ప్రైజ్ మనీలో సగం పొందుతారు.
ప్రైజ్ మనీ కేవలం విజేతలు, రన్నరప్ లకే కాదు సెమీ ఫైనలిస్టులకు కూడా మొత్తం $5.6 మిలియన్ల ప్రైజ్ పూల్ నుండి $4,00,000 అందుకుంటారు. అంతే కాకుండా సూపర్ 12 దశను దాటడంలో విఫలమైన జట్లకు ఐసీసీ నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించింది.
ఎనిమిది జట్లు ఒక్కొక్కటి $70,000 గెలుచుకుంటాయి. ఇక 2021లో ఏర్పాటు చేసిన ఫార్మాట్ ను అనుసరించి 30 గేమ్ లలో గెలుపొందిన జట్టుకు $40,000 అందుతాయి.
భారతీయ రూపాయలలో చూస్తే టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు రూ. 13,05,35,440 పొందుతుంది. రన్నరప్ జట్టు రూ. 6,52,64,280, సెమీ ఫైనలిస్ట్ జట్టు రూ. 3,26,20,220, సూపర్ 12లో గెలుపొందిన జట్లకు రూ. 32,62,022, ఇక సూపర్ 12 లో నిష్క్రమించిన జట్లకు రూ. 57,08,013, మొదటి రౌండ్ లో గెలుపొందిన జట్టుకు రూ. 32,62,022 , మొదటి రౌండ్ లో నిష్క్రమించిన జట్టుకు రూ. 32,62,022.
ఇక టోర్నీ విషయానికి వస్తే ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ , ఇంగ్లండ్ , ఇండియా, న్యూజిలాండ్ , పాకిస్తాన్ , దక్షిణాఫ్రికా ఎనిమిది జట్లు సూపర్ 12 దశకు చేరుకున్నాయి.
రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ -ఎ లో నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్ , యుఏఈ ఉన్నాయి. వెస్టిండీస్, స్కాట్లాండ్ , ఐర్లాండ్ , జింబాబ్వే గ్రూప్ -బిలో ఉన్నాయి.
Also Read : మహిళల ఆసియా కప్ షెడ్యూల్
Prize money for the ICC Men’s #T20WorldCup 2022 revealed 👀
More ➡️ https://t.co/NdYGgWOIMf pic.twitter.com/qdQm3vvSr5
— T20 World Cup (@T20WorldCup) September 30, 2022