Commercial LPG Prices Slashed : వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు
ఊరటనిచ్చిన గ్యాస్ కంపెనీలు
Commercial LPG Prices Slashed : గ్యాస్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ పరంగా చూస్తే కమర్షియల్ సిలిండర్ ధరలు కొద్దిగా తగ్గించబడ్డాయి. తాజాగా సవరణలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర (Commercial LPG Prices) దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,885 కి బదులుగా రూ. 1,859 కి చేర్చింది. కాగా డొమెస్టిక్ (వంట) గ్యాస్ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఎలాంటి మార్పులు లేవు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో సహజ వాయువు ధరలు రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగిన ఒక రోజు తర్వాత భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశ రాజధానిలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను తక్షణమే రూ. 25.50కి తగ్గించాయి.
ఈ తాజా సవరణలతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,885కి బదులు రూ. 1,859.50 కానుంది. సెప్టెంబర్ 1న, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర రూ. 91.50కి తగ్గింది. ఢిల్లీలో ధర రూ. 1,886 నుండి 1,976కి తగ్గింది. ఆగస్టు 1న వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ల ధరలు కూడా రూ. 36కి తగ్గాయి.
అంతకు ముందు జూలై 6న 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై యూనిట్ కు రూ. 8.5 తగ్గించారు. ఇక జూలై 6న 14.2 కిలోల బరువున్న దేశీయ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను యూనిట్ కు రూ. 50 పెంచారు. ఇంతకు ముందు దేశీయ సిలిండర్ల ధరలు మే 19, 2022న సవరించబడ్డాయి.
ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం యూనిట్ కు రూ. 1,053గా విక్రయిస్తోంది. ప్రపంచ మార్కెట్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గ్యాస్ ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇంకో వైపు కరోనా సాకుతో, ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేస్తుందన్న నెపంతో ధరలను పెంచుతూ పోయింది కేంద్ర సర్కార్.
Also Read : దేశంలో 5జీ సేవలు పారా హుషార్