Babar Azam Record : విరాట్ కోహ్లీ స‌ర‌స‌న బాబ‌ర్ ఆజమ్

టి20లో 3,000 ప‌రుగుల మైలు రాయి

Babar Azam Record :  స్టార్ ప్లేయ‌ర్ పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజమ్ అరుదైన ఘన‌త సాధించాడు. 3,000 ప‌రుగుల కంటే ఎక్కువ ర‌న్స్ చేసిన క్రికెట‌ర్ గా నిలిచాడు. టి20 ఫార్మాట్ లో అరుదైన చ‌రిత్ర సృష్టించాడు.

పొట్టి ఫార్మాట్ లో మూడు వేల‌కు పైగా ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదవ క్రికెట‌ర్ గా బాబ‌ర్ ఆజమ్ నిలిచాడు. భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ స‌ర‌స‌న నిలిచాడు పాకిస్తాన్ కెప్టెన్. అత్యంత వేగవంత‌మైన ర‌న్స్ చేసిన ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు బాబ‌ర్ ఆజమ్.

ప్ర‌స్త‌తం పాకిస్తాన్ లో ఇంగ్లండ్ ప‌ర్య‌టిస్తోంది. ఏడు మ్యాచ్ ల టి20 సీరీస్ కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా పొట్టి ఫార్మాట్ లో ఈ ఘ‌న‌త సాధించాడు పాకిస్తాన్ కెప్టెన్. 27 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన బాబ‌ర్ ఆజం(Babar Azam Record) టి20 ఫార్మాట్ లో 3,000 ర‌న్స్ చేశాడు. 

వీటిని అత్యంత వేగ‌వంతంగా సాధించాడు. విచిత్రం ఏమిటంటే ఈ ప‌రుగుల్ని ఇద్ద‌రు ఆట‌గాళ్లు కోహ్లీ, బాబ‌ర్ ఆజం 81 ఇన్నింగ్స్ ల‌లో సాధించ‌డం విశేషం. ఐర్లాండ్ కు చెందిన పాల్ స్టిర్లింగ్ ను కూడా అధిగ‌మించాడు.

నాలుగో ఆట‌గాడిగా నిలిచాడు. రోహిత్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ కు చెందిన మార్టిన్ గ‌ఫ్టిల్ ల వెనుక మాత్ర‌మే ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా లాహోర్ లోని గ‌డ్డాఫీ స్టేడియంలో జ‌రిగిన కీల‌క‌మైన టి20 మ్యాచ్ లో బాబ‌ర్ ఆజ‌మ్(Babar Azam Record) 87 ప‌రుగుల‌తో అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు.

6 వికెట్ల‌కు 169 ర‌న్స్ చేయ‌డంలో కీల‌క భూమిక పోషించాడు. ఈ మ్యాచ్ లో మ‌రో ఓపెన‌ర్ రిజ్వాన్ లేక పోవ‌డంతో ఇఫ్తికార్ అహ్మ‌ద్ 31 ర‌న్స్ తో రాణించాడు. బాబ‌ర్ ఆజ‌మ్ 59 బంతుల్లో అజేయంగా 87 ర‌న్స్ చేశాడు.

Also Read : నేటి నుంచే మ‌హిళ‌ల ఆసియా క‌ప్

Leave A Reply

Your Email Id will not be published!