PM Modi Testing : 5జీ టెస్టింగ్ మోదీ కారు డ్రైవింగ్ స‌క్సెస్

దేశ వ్యాప్తంగా 13 న‌గ‌రాల‌లో స‌ర్వీసులు

PM Modi Testing : భార‌త దేశ‌పు టెలికాం రంగంలో 5జీ స‌ర్వీసుల‌ను ప్రారంభించారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మొబైల్ కాంగ్రెస్ లో 5జీ స‌ర్వీసుల‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. దీనిని దేశ రాజ‌ధానిలోని ప్ర‌గ‌తి మైదానంలో ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్ నాలుగు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్నారు. శ‌నివారం అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. మైదాన్ లో ఏర్పాటు చేసిన కారును టెస్ట్ డ్రైవ్ చేశారు. దీనిని 5జీ టెక్నాల‌జీతో అనుసంధానం చేశారు. యూర‌ప్ లో కారు టెస్ట్ ను చేప‌ట్టారు. ఈ ఫోటోను కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచాన్ని భార‌త్ న‌డుపుతోంద‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. మొబైల్ కాంగ్రెస్ లో భార‌త దేశానికి చెందిన దిగ్గ‌జ టెలికాం కంపెనీలు ఇక్క‌డ ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన మంత్రి 5జీ టెక్నాల‌జీకి సంబంధించిన మొద‌టి అనుభవాన్ని అనుభ‌వించేందుకు వివిధ టెలికాం ఆప‌రేట‌ర్ల పెవిలియ‌న్ల‌ను సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన రిల‌య‌న్స్ జియో స్టాల్స్ లో ప్ర‌ధాన మంత్రి మోదీకి రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మెన్ ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ ఈ అత్యాధునిక 5జీ టెక్నాల‌జీ గురించి వివ‌రించారు. అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి(PM Modi Testing) ఎయిర్ టెల్ , వొడా ఫోన్ ఐడియా, సీ డాట్ , త‌దిత‌ర సంస్థ‌ల స్టాల్స్ ను సంద‌ర్శించారు.

డిజిట‌ల్ ఇండియాకు టెలికాం గేట్ వేన‌ని పేర్కొన్నారు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్.

Also Read : నాగాలాండ్ 9 జిల్లాల్లో వివాదాస్ప‌ద చ‌ట్టం

Leave A Reply

Your Email Id will not be published!