Mahatma Gandhi : ఓ మహాత్మా..ఓ మహర్షి..!
జాతిపిత సూక్తులు స్పూర్తి కిరణాలు
Mahatma Gandhi : భారత దేశం గర్వించ దగిన నాయకులలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ(Mahatma Gandhi). ఆయనను జాతి యావత్తు జాతిపితగా భావిస్తారు. నేటికీ యావత్ ప్రపంచమంతా ఆయన ప్రవచించిన శాంతి మార్గం కోట్లాది మందిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా గాంధీ చెప్పిన సూక్తులు ఎల్లప్పటికీ ఎక్కడో ఒక చోట గుర్తు చేసుకుంటారు.
వాటిలో నా జీవితమే నా సందేశం అన్న గాంధీ కోట్ ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయింది. 1869న గుజరాత్ లోని పోరుబందర్ లో పుట్టారు. సత్యం, అహిందస అనేది ఆయన ప్రవచించారు. గట్టిగా నమ్మారు. దేశీయ కళలకు విలువ ఇవ్వడం నేర్పించారు. నిజ జీవితంలో సరళతను పాటిస్తూ ప్రపంచం మొత్తం మీద తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా పేరొందారు గాంధీ.
అందుకే బాపు , ఆయన బోధనలు ఇప్పటికీ సందర్భోచితమైనవిగా గౌరవించ బడుతున్నాయి. మహాత్మా గాంధీ భారత దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకుడు. ఆయన జన్మ దినం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు అహింస, నిస్వార్థ సేవకు సంబంధించిన విలువలను ప్రతిబింబించేలా చేస్తోంది.
బ్రిటన్ వలస పాలన నుండి భారత దేశాన్ని విముక్తి చేసేందుకు తన జీవితమంతా అంకితం చేశారు. బాపు 153వ జయంతిని జరుపుకుంటున్నారు. ప్రతి రోజును ఆశావాదంతో నింపేందుకు స్ఫూర్తి దాయకమైన, ప్రేరణాత్మకమైన సూక్తులు ఇక్కడ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సూక్తులు ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.
మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు. తర్వాత వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు. తర్వాత వారు మీతో పారాడుతారు. తర్వాత మీరు గెలుస్తారు. మీరు చని పోతారని భావించి జీవించండి. మీరు ఎప్పటికీ జీవించేలా నేర్చుకోండి.
మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరు అయి ఉండాలి. మిమ్మల్ని మీరు కనుగొనేందుకు ఉత్తమ మార్గం ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం.
శారీరక సామర్థ్యం వల్ల బలం రాదు. ఇది లొంగని సంకల్పం నుండి వస్తుంది. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమాపణ అనేది బలవంతుల లక్షణం. తమ మిషన్ పై అచంచల విశ్వాసంతో నిశ్చయించ బడిన ఆత్మల చిన్న శరీరం చరిత్ర గతిని మార్చగలదు.
న్యాయ స్థానాల కంటే ఉన్నత న్యాయ స్థానం ఉంది. అది మన మనస్సాక్షి కోర్టు. ఇది అన్ని ఇతర కోర్టులను అధిగమించింది. చెడుతో సహకరించక పోవడం ఎంత కర్తవ్యమో మంచికి సహకరించడం కూడా అంతే విధి. కంటికి కన్ను మాత్రమే ప్రపంచం మొత్తాన్ని అంధుడిని చేస్తుందన్నారు గాంధీ.
Also Read : 2024 నాటికి దేశమంతటా 5జీ సేవలు