Lal Bahadur Shastri Comment : శాస్త్రి ప్రస్థానం ప్రాతః స్మరణీయం
సమున్నత జీవితం విలువల ప్రస్థానం
Lal Bahadur Shastri Comment : దేశానికి దిశా నిర్దేశం చేసిన నాయకులలో అరుదైన నాయకుడు మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. అక్టోబర్
2 గుర్తుంచు కోదగిన తేదీలలో ఇద్దరు మహానుభావులు పుట్టారు. వారిలో ఒకరు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ కాగా మరొకరు శాస్త్రి. దేశాన్ని ప్రభావితం చేసిన వారు ఎందరో ఉన్నారు.
వేలాది మంది తమ అసాధారణమైన వ్యక్తిత్వంతో, నాయకత్వ పటిమతో ఎల్లకాలం గుర్తుండి పోయేలా తమను తామను ప్రూవ్ చేసుకున్నారు. ఈ
క్రమంలో విలువలే ప్రాతిపదికగా తన జీవితం మొత్తం అలాగే గడిపిన జాతి గర్వించదగిన నేతల్లో మొదటి వాడు లాల్ బహదూర్ శాస్త్రి.
ఆయన జీవితమంతా కష్టాలమయం. చదువుకునేందుకు వాగు దాటి వెళ్లి అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవిని అధీష్టించిన నాయకుడు. ఆయన
మరణంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. కానీ లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) ఇవాళ లేక పోయినా నేటికీ గుర్తుంచు కోదగిన , స్పూర్తి దాయకమైన జీవితం.
ఇవాళ భారత దేశంలో రాజకీయం అంటేనే మోసం, కుట్ర, దగా, దోపిడీ, ఆస్తులు పోగేసుకోవడం, దారుణాలకు పాల్పడడం , ప్రత్యర్థులను ఇబ్బందులకు
గురి చేయడం. కానీ పీఎం అయినా ఏనాడూ ప్రభుత్వ సొమ్మును వాడుకోని వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. సమున్నతమైన విలువలకు ఆయన ప్రతీకగా నిలిచారు.
ఎలాంటి భేషజాలు లేని అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపిన ధీశాలి శాస్త్రి. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జై జవాన్ జై కిసాన్
అంటూ పిలుపునిచ్చాడు. ఎక్కడిక వెళ్లినా ఏళ్లు గడిచినా , 75 ఏళ్లవుతున్నా నేటికీ ఆ నినాదం కోట్లాది మంది రైతులకు, జవాన్లకు ఊరిగా మారింది.
దేశానికి రైతులు అన్నం పెట్టి ఆకలి తీరుస్తారు. సైనికులు దేశ సరిహద్దుల్లో నిత్యం కాపలాగా ఉంటారు. అందుకే ఎంతో ముందు చూపుతో లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. కోట్లాది మందిని నేటికీ ప్రభావితం చేస్తుంది. చేస్తూనే ఉంటుంది. శ్వేత విప్లవానికి ఆద్యుడు ఆయనే. భారతీయ రాజకీయవేత్తగా, రాజనీతిజ్ఞుడుగా పేరొందారు శాస్త్రి.
గుజరాత్ లో ఆనంద్ లో డెయిరీ విప్లవానికి శ్రీకారం చుట్టింది ఆయనే. ఆయన వల్లనే పాల ఉత్పత్తి దేశంలో గణనీయంగా పెరిగేందుకు కారణమయ్యాడు.
1965లో హరిత విప్లవానికి పునాదులు వేసింది కూడా శాస్త్రినే. భారత దేశానికి మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు.
ఎక్కడో రైలు ఘటన జరిగితే వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత హోం శాఖ మంత్రిగా , ప్రధానిగా పని చేసినా తనకంటూ సొంత
ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోని ఏకైక నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి. నిన్నటి తరమే కాదు రేపటి తరానికి కూడా ఆయన ఆదర్శప్రాయుడు.
అనువంత స్థానం దొరకగానే దొరికేంత దాకా దోచుకోవాలని అనుకునే ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీ కలిగిన శాస్త్రి గారి లాంటి వాళ్లు ఉండటం చాలా అరుదు. తన కొడుకు ప్రమోషన్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు ఎల్లప్పటికీ గుర్తుంచు కోదగినవి.
పాలకుల నిజాయితీని ప్రజలు శంకించే లాగా జీవించడానికి నేను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. శాస్త్రి జీవితం, నమ్మిని విలువలు, ఆచరించిన విధానం ప్రతి ఒక్కరికీ అనుసరణీయం, ప్రాతః స్మరణీయం.
Also Read : గాంధీ..శాస్త్రిలకు నరేంద్ర మోదీ నివాళి